Shruti Haasan: పెద్ది స్పెషల్ సాంగ్‌పై వివాదం.. జర్నలిస్ట్‌కు శ్రుతిహాసన్ స్ట్రాంగ్ ఆన్సర్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమాలను తక్కువ చేసి మాట్లాడటం కొందరు తమిళ జర్నలిస్టులకు ఈ మధ్య అలవాటుగా మారిపోయింది. గతంలో ఓ తమిళ సినిమాను పొగుడుతూ తెలుగు చిత్రాలను అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేసిన ఓ జర్నలిస్ట్.. తాజాగా మరోసారి తన తీరును బయటపెట్టాడు. రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ మూవీ 'పెద్ది'లో శ్రుతి హాసన్ చేసిన స్పెషల్ సాంగ్, ఆమె డ్రెస్సింగ్ గురించి వివాదం సృష్టించే ప్రయత్నం చేశాడు. అయితే అతడికి ఊహించని సమాధానం ఎదురైంది. ఇటీవల 'పెద్ది' సినిమాలో తన డ్రెస్సింగ్ గురించి హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే తరహాలో శ్రుతిహాసన్‌ను కూడా ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టాలని ఆ జర్నలిస్ట్ ప్రయత్నించాడు.
వివరాలు
స్పెషల్ సాంగ్‌పై వివాదాస్పద ప్రశ్న
ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్‌ను ఉద్దేశించి.. పెద్ది సినిమాలో మీరు చేసిన స్పెషల్ సాంగ్‌ను ఎలా చూస్తారు? అలాంటి పాటలను ప్రత్యేకంగా గ్లామర్ కోసమే పెడతారని మీకు తెలుసు కదా? అంటూ ప్రశ్నించాడు.
తద్వారా తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే కేవలం గ్లామర్ కోసమే అన్నట్లుగా ఆమెతో చెప్పించాలని ప్రయత్నించాడు.
అయితే ఆ జర్నలిస్ట్ అంచనాలను తలకిందులు చేస్తూ శ్రుతిహాసన్ ఏమాత్రం తడబడకుండా సమాధానమిచ్చింది.
ఇందుకు సంబంధించిన వీడియో, ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాలు
'నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం.. అందంగా రెడీ అవ్వడమూ ఇష్టమే'
నాకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అందంగా రెడీ అవ్వడం కూడా ఇష్టమే. ఈ పాటను నేను ఆ కోణంలోనే చూస్తాను.
గ్లామర్ విషయంలో నా ఆలోచనా విధానం నాకు ఎంతో స్వేచ్ఛను ఇస్తుంది. ఎవరినో మెప్పించడం కోసం నేను ఎప్పుడూ ఏ పనీ చేయలేదని శ్రుతిహాసన్ స్పష్టం చేసింది.
అంతేకాకుండా డ్రెస్సింగ్ విషయంలో తనకు ఉన్న స్పష్టతను కూడా వివరించింది. ''నాకు ఏదైనా డ్రెస్ కంఫర్టబుల్‌గా అనిపించకపోతే.. 'నేను ఇది వేసుకోను' అని మొహం మీదే చెప్పేస్తాను. ఒకవేళ ఆ డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేశానంటే.. అది నాకు పూర్తిగా కంఫర్టబుల్‌గా ఉన్నట్టే లెక్క'' అంటూ తేల్చిచెప్పింది.
వివరాలు
'అది నా శరీరం.. నా ఇష్టం!'
ఈ విషయంలో సినిమా సెట్స్‌లో వాదనలు కూడా జరిగాయని శ్రుతిహాసన్ వెల్లడించింది. తనను 'డిఫికల్ట్' అని ముద్ర వేసినా పట్టించుకోనని స్పష్టం చేసింది.
ఎందుకంటే అది నా శరీరం.. నా ఇష్టం!'' అంటూ నవ్వుతూనే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది.
తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ విషయంలో అనవసర వివాదం సృష్టించాలని ప్రయత్నించిన ఆ జర్నలిస్ట్‌కు శ్రుతిహాసన్ తన సమాధానంతో గట్టి కౌంటర్ ఇచ్చిందని టాలీవుడ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
డ్రెస్సింగ్ విషయంలో జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో శ్రుతి ఇచ్చిన సమాధానం కూడా హాట్ టాపిక్‌గా మారింది.