Page Loader
Rajinikanth: త‌లైవా బ‌ర్త్ డే కానుక‌గా.. 'కూలీ' నుండి అభిమానులకు డబుల్ ట్రీట్
త‌లైవా బ‌ర్త్ డే కానుక‌గా.. 'కూలీ' నుండి అభిమానులకు డబుల్ ట్రీట్

Rajinikanth: త‌లైవా బ‌ర్త్ డే కానుక‌గా.. 'కూలీ' నుండి అభిమానులకు డబుల్ ట్రీట్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2024
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రేపు (12న) తన 74వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఇదే సమయంలో,ఆయన సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఆయ‌న బ‌ర్త్‌డే కోసం అభిమానులు ఎదురుచూస్తున్నవిష‌యం తెలిసిందే. ఇటీవల విడుదలైన 'వెట్టాయన్' చిత్రంతో భారీ హిట్ సాధించిన రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండ‌గా.. .అలాగే నాగార్జున,ఉపేంద్ర,సత్యరాజ్,చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో టాప్ దర్శకులలో ఒకడైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ కలిసి పనిచేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రోమో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

వివరాలు 

రూ.600 కోట్లకు పైగా వసూలు చేసిన 'జైలర్'

ఈ సినిమా నుంచి త‌లైవా బ‌ర్త్‌డే కానుక‌గా, రిలీజ్ డేట్‌తో పాటు స్పెష‌ల్ గ్లింప్స్ విడుదల చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఈరోజు రాత్రి పూర్తి క్లారిటీ రానున్నట్లు సమాచారం. మరోవైపు, త‌లైవా నటించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం 'జైలర్'గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని దర్శకుడు వెల్లడించిన విషయం తెలిసిందే. రెండో భాగానికి కూడా నెల్సన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ను కూడా త‌లైవా బ‌ర్త్‌డే రోజున ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది, దీంతో రజనీ అభిమానులు రెట్టింపు ఆనందంలో ఉన్నారు.