Page Loader
CPI Narayana : బిగ్‌బాస్ షోపై సీపీఐ నారాయణ మండిపాటు.. అందుకే రైతుబిడ్డ అంటూ తీసుకొచ్చారు
అందుకే రైతుబిడ్డ అంటూ తీసుకొచ్చారు

CPI Narayana : బిగ్‌బాస్ షోపై సీపీఐ నారాయణ మండిపాటు.. అందుకే రైతుబిడ్డ అంటూ తీసుకొచ్చారు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 19, 2023
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బిగ్‌బాస్ షోపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ వ్యాజ్యం దాఖలు చేశారు. బిగ్‌ బాస్ 7 ఫైనల్ పూర్తి కాగానే పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అయితే ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్ బయట పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇతర కంటెస్టెంట్స్, వారి కార్లపై దాడి చేశారు. దీంతో ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రైవేట్ వాహనాలతో పాటు, ఆర్టీసీ బస్సులు సైతం ధ్వంసమయ్యాయి. తాజాగా బిగ్‌బాస్ ఘటనపై స్పందించిన సీపీఐ నారాయణ బిగ్‌బాస్ షో బయట ఆర్టీసీ బస్సులు పగలకొట్టడంపై మండిపడ్డారు.

details

ముందు నాగార్జునపై కేసు పెట్టాలి : సజ్జనార్

ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బాధ్యులపై కేసులు పెడతామంటున్నారని, అసలు బిగ్‌బాస్ షోనే అరాచకమని, ముందు నాగార్జునపై కేసు నమోదు చేయాలన్నారు. మరోవైపు సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్నప్పుడే తాను బిగ్‌బాస్ షో నేరం, అసభ్యతతో కూడకుందని చెప్పానన్నారు. దాని మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ సైతం ఇస్తే మూడు రోజుల్లో తాను చేయలేనని చెప్పారన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లాలని సలహా ఇచ్చారన్నారు. కేవలం డబ్బుల కోసమే నాగార్జున లాంటి వాళ్లు యాంకరింగ్ చేస్తున్నారన్నారు. కొందరని తీసుకెళ్లి ఓ కొంపలో పడేసి దాన్నో వ్యభిచార కొంపలా చేశారని మండిపడ్డారు. గ్రామీణులను ఆకర్షించేందుకే రైతుబిడ్డ నాటకం ఆడారని, పట్టణ ప్రాంతాల్లోని వారు పట్టించుకోకపోవడంతోనే పల్లె యువత లక్ష్యంగా ఈ ప్రైజ్'మనీ ఇచ్చారన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బిగ్ బాస్ 7షోపై సీపీఐ నారాయణ ఆగ్రహం