LOADING...
Ram Charan-Sukumar: RC 17లో క్రేజీ బ్యూటీ.. రామ్ చరణ్-సుకుమార్ కాంబో మరోసారి హాట్ టాపిక్!
RC 17లో క్రేజీ బ్యూటీ.. రామ్ చరణ్-సుకుమార్ కాంబో మరోసారి హాట్ టాపిక్!

Ram Charan-Sukumar: RC 17లో క్రేజీ బ్యూటీ.. రామ్ చరణ్-సుకుమార్ కాంబో మరోసారి హాట్ టాపిక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పెద్ది'. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈచిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ మరోసారి స్టార్ దర్శకుడు సుకుమార్‌తో చేతులు కలపడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2026ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది.

Details

రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం

ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే RC 17 సినిమాకు సుకుమార్ ఇప్పటికే హీరోయిన్‌ను ఫిక్స్ చేశారట. ఇటీవల కాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న మలయాళ నటి రుక్మిణి వసంత్‌ను ఈ చిత్రానికి హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ కథకు రామ్ చరణ్ సరసన రుక్మిణి వసంత్ అయితేనే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నారట. ఇప్పటికే హీరోయిన్‌తో చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Details

సినిమాపై రెట్టింపు అంచనాలు

గతంలో రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' సినిమా ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆ సమయంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించాడని కాకుండా, చిట్టిబాబు పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి అదే కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. ఈ భారీ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement