Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ ఆఫర్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో రోమాన్స్..?
ఈ వార్తాకథనం ఏంటి
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇటీవలే కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ సరసన నటించిన 'అమరన్' సినిమాలో మెప్పించి పెద్ద గుర్తింపు పొందింది.
ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న 'తండేల్', 'రామాయణం' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.
వరుసగా విజయాలను సాధిస్తున్న సాయి పల్లవికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా సాయి పల్లవి మరో అద్భుత ఆఫర్‌ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు సుకుమార్ ఓ భారీ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
Details
కీలక పాత్రలో సాయి పల్లవి
ఈ సినిమా 2025 ఎండింగ్‌లో ప్రారంభమవుతుంది. ఇందులో సాయి పల్లవిని కీలక పాత్రలో తీసుకునేందుకు మేకర్స్ నిర్ణయించారని తెలిసింది.
ఈ ఆఫర్‌ని సాయి పల్లవి కూడా అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి.
దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.