LOADING...
Spirit: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా 'స్పిరిట్' నుంచి అదిరిపోయే సర్ప్రైజ్.. మూవీ స్టోరీ వీడియో వైర‌ల్

Spirit: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా 'స్పిరిట్' నుంచి అదిరిపోయే సర్ప్రైజ్.. మూవీ స్టోరీ వీడియో వైర‌ల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్టోబర్ 23వ తేదీ గురువారం ప్రభాస్ అభిమానులకు పండగరోజే. ఆ రోజు ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సంబర వాతావరణమే. ఈ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో మరో సర్‌ప్రైజ్‌గా సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. స్పిరిట్ అప్‌డేట్‌తో హైపే హైప్ ప్రభాస్ బర్త్ డే రోజు రాత్రి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్ డేట్ అందించాడు. "సౌండ్ స్టోరీ" పేరుతో కేవలం సంభాషణలతో కూడిన వీడియోను షేర్ చేస్తూ సినిమా హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.

వివరాలు 

స్పిరిట్ స్టోరీ

''హ్యాపీ బర్త్‌డే ప్రభాస్ అన్నా! ప్రతి అభిమానికి హార్ట్ నుంచి నేరుగా ఈ సౌండ్ స్టోరీని ఐదు భాషల్లో అందిస్తున్నాం'' అని సందీప్ రెడ్డి వంగా ఎక్స్ (ట్విట్టర్)‌లో రాత్రి పోస్టు చేశారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సమాంతరంగా రూపొందుతోంది. 'అర్జున్ రెడ్డి','కబీర్ సింగ్', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్లతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ మూవీ అనగానే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు విడుదలైన ఈ సౌండ్ స్టోరీతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. రాత్రి 11 గంటలకు విడుదలైన వీడియోలో ప్రభాస్ ఒక అగ్రశ్రేణి ఐపీఎస్ అధికారిగా, ఎవరినీ లెక్కచేయని ధైర్యవంతుడిగా కనిపించనున్నాడని సూచిస్తుంది.

వివరాలు 

వీడియోలోని కీలక సన్నివేశం 

వీడియోలో జైలు సూపరింటెండెంట్ పాత్రలో ప్రకాశ్ రాజ్ వాయిస్ వినిపిస్తుంది. మొదట "ఎవడ్రా వీడు?" అనే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది. దానికి ఓ కానిస్టేబుల్ "కొత్త ఖైదీ సార్" అని సమాధానమిస్తాడు. ప్రకాశ్ రాజ్ - "ఇది పరేడ్ గ్రౌండ్ కాదు... వాక్ ఫాస్ట్!" అంటూ కటినంగా మాట్లాడతాడు. "ఐపీఎస్ సర్, అకాడమీ టాపర్ సర్" అని కానిస్టేబుల్ చెప్పగా, "ఇక్కడ ఆల్ఫాబెట్లు కాదు... నంబర్స్ మాత్రమే! ఆ బ్లాక్ స్లేట్ ఇవ్వండి, వివరాలు రాయండి, లెఫ్ట్, రైట్, సెంటర్ ఫోటోలు తీయండి" అని ఆదేశిస్తాడు.

వివరాలు 

ఖైదీ యూనిఫాం సంభాషణ 

"వీడి గురించి విన్నాను. యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్ ఒకేలా ఉంటుందట. కండక్ట్ ఇష్యూల వల్ల ఒకసారి టెర్మినేట్ అయ్యాడట. చూద్దాం ఈసారి ఖైదీ డ్రెస్‌లో ఎలా ఉంటాడో" అని అంటాడు. దానికి కానిస్టేబుల్ "సార్, ఇది రిమాండ్ పీరియడ్ కదా?" అని అడుగుతాడు. వెంటనే ప్రకాశ్ రాజ్ - "షటప్! నా జైలులో సివిలియన్ డ్రెస్ నచ్చదు. ఖాకీ లేదా ఖైదీ మాత్రమే! వీడి బట్టలు తీసేసి మెడికల్ టెస్టులకు పంపండి" అంటూ రూత్‌లెస్‌గా ఆర్డర్ ఇస్తాడు.

వివరాలు 

ప్రభాస్ డైలాగ్ హైలైట్ 

వీడియో చివర్లో ప్రభాస్ చెప్పిన లైన్ మాత్రం అభిమానుల్లో అగ్నిపర్వతం రేపింది. "మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుంచీ ఓ చెడ్డ అలవాటు ఉంది..." అంటూ చెబుతూ ఆ వాక్యాన్ని ఇంగ్లీష్‌లో కూడా రిపీట్ చేస్తాడు. అంతటితో వీడియో ముగుస్తుంది. ఈ సౌండ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్, కాంచన తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2026లో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్