Varanasi : మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో క్రేజీ అప్‌డేట్.. తండ్రి పాత్రకి సీనియర్ యాక్టర్!
ఈ వార్తాకథనం ఏంటి
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో 'వారణాసి' టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అలాగే విడుదలైన చిన్న గ్లింప్స్‌కు అభిమానుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
Details
కీలక పాత్రలో ప్రకాష్ రాజ్
ఇతర నటీనటుల విషయాలు చిత్ర బృందం ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే తాజా రూమర్ల ప్రకారం, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం i బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ను సంప్రదించినప్పటికీ, చివరికి ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ప్రకాష్ రాజ్‌కు దర్శకుడు రాజమౌళితో మంచి అనుబంధం ఉంది. గతంలో 'విక్రమార్కుడు' సినిమాలో వీరిద్దరూ కలిసి పని చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ అవుతుందనే వార్తలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Details
2027లో మూవీ రిలీజ్
ఇటీవలే ఆయన పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ'లో కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు 'వారణాసి'లో ప్రకాష్ రాజ్ పాత్రపై అధికారిక ప్రకటన వచ్చిస్తే, ఈ సినిమా హైప్ మరింత పెరుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 2027లో ప్రేక్షకుల ముందుకు వస్తే, 'వారణాసి' టాలీవుడ్‌లో భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న సినిమా అవుతుంది.