NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / దాదాసాహేబ్ ఫాల్కే బర్త్ డే: భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన వ్యక్తి జీవితంలోని మీకు తెలియని విషయాలు 
    దాదాసాహేబ్ ఫాల్కే బర్త్ డే: భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన వ్యక్తి జీవితంలోని మీకు తెలియని విషయాలు 
    సినిమా

    దాదాసాహేబ్ ఫాల్కే బర్త్ డే: భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన వ్యక్తి జీవితంలోని మీకు తెలియని విషయాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    April 30, 2023 | 05:05 am 0 నిమి చదవండి
    దాదాసాహేబ్ ఫాల్కే బర్త్ డే: భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన వ్యక్తి జీవితంలోని మీకు తెలియని విషయాలు 
    దాదా సాహెబ్ ఫాల్కే బర్త్ డే

    1913లో భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఫీఛర్ ఫిలిమ్ రిలీజైంది. అదే రాజా హరిశ్చంద్ర. ఆ సినిమాను తెరకెక్కించింది దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఆయనే ఆ తర్వాత దాదాసాహేబ్ ఫాల్కే అయ్యారు. 1870లో ఏప్రిల్ 30వ తేదీన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ లో జన్మించారు దాదాసాహెబ్ ఫాల్కే. 19ఏళ్ల సినిమా కెరీర్లో 95సినిమాలు, 27లఘుచిత్రాలు తెరకెక్కించాడు. ఆయన తన కెరీర్ లో రూపొందించిన చివరి చిత్రం గంగావతరణ్(1937)లో మాత్రమే సౌండ్, డైలాగ్స్ ఉన్నాయి. మిగతావన్నీ మూకీ చిత్రాలే. భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన ఫాల్కే 1944లో మరణించారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం, 1969లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రారంభించింది. ఈ పురస్కారాన్ని సినిమా రంగంలోని అత్యున్నత పురస్కారంగా భావిస్తారు.

    పెయింటర్ రాజా రవివర్మతో పనిచేసిన ఫాల్కే 

    సినిమా రంగంలో విశేష సేవ చేసిన కళాకారులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తారు. ఈరోజు ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విషయాలు తెలుసుకుందాం. 15సంవత్సరాల వయసులో ముంబైలోని జె.జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో జాయిన్ అయిన ఫాల్కే, డ్రాయింగ్, పెయింటింగ్, ఫోటోగ్రఫీపై శిక్షణ తీసుకున్నాడు. 1890లో ఫోటోగ్రాఫర్ గా పనిచేయడానికి గుజరాత్ లోని వడోదర చేరుకున్నాడు. ప్లేగువ్యాధి కారణంగా తన మొదటి భార్య, బిడ్డ చనిపోవడంతో ఫోటోగ్రాఫర్ ఉద్యోగం మానేసాడు. కొంతకాలం భారత పురావస్తు శాఖలో పనిచేసి, ఆ తర్వాత రాజీనామా చేసి ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించాడు. ఆ తర్వాత పెయింటర్ రాజా రవివర్మతో కలిసి విదేశాలకు వెళ్లాడు. అక్కడే లైఫ్ ఆఫ్ క్రీస్ట్ సినిమాను చూసాడు.

    15వేల ఖర్చుతో రాజా హరిశ్చంద్ర సినిమా 

    ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా తెరకెక్కిన లైఫ్ ఆఫ్ క్రీస్ట్ సినిమా చూసిన తర్వాత, భారతదేశ ప్రజలకు, తమ దేవుళ్ళను తెరమీద చూపించాలని అనుకున్నాడు ఫాల్కే. ఆ స్ఫూర్తితోనే 1913లో రాజా హరిశ్చంద్ర సినిమాను 15వేల రూపాయల ఖర్చుతో నిర్మించాడు. ఆయన సతీమణి, రాజా హరిశ్చంద్ర సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసారు. ఫాల్కే కుమారుడు హరిశ్చంద్రుడి కుమారుడి పాత్రలో నటించారు. రాజా హరిశ్చంద్ర తర్వాత మోహినీ భస్మాసుర, సత్యవాన్ సావిత్రి, శ్రీకృష్ణ జననం, కాళీయ మర్దన్ మొదలగు చిత్రాలను రూపొందించారు. భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన ఫాల్కే, 1944లో తన స్వగ్రామంలో ఫిబ్రవరి 16వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఫాల్కే జీవిత కథ ది సైలెంట్ ఫిలిమ్ పేరుతో పుస్తకరూపంలో అందుబాటులో ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలుగు సినిమా
    సినిమా

    తెలుగు సినిమా

    బాహుబలి 2: భారతీయ సినిమా రంగాన్ని తెలుగు సినిమా వైపు తిప్పిన చిత్రానికి ఆరేళ్ళు  సినిమా రిలీజ్
    రవీంద్రనాథ్ ఠాగూర్ కొటేషన్ ని షేర్ చేస్తూ 36ఏళ్ల వయసులో అన్నీ చూసానంటున్న సమంత  సమంత
    తెలుగు సినిమా చరిత్రలో గుర్తుండిపోయే రిలీజ్ తేదీ ఏప్రిల్ 28: ఈరోజున రిలీజైన భారీ చిత్రాలు  సినిమా
    ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ: ప్రీమియర్స్ చూసిన వారు పంచుకుంటున్న విశేషాలివే  ఏజెంట్

    సినిమా

    ఆదిపురుష్ కొత్త పోస్టర్ రిలీజ్: సీత కళ్ళలో కన్నీరు  సినిమా
    ఛత్రపతి: బరేలీ కా బజార్ సాంగ్ లో బెల్లంకొండ మాస్ స్టెప్పులు, నుస్రత్ బరూచా ఘాటు హొయలు  బాలీవుడ్
    కేజీఎఫ్ 3పై తన మనసులోని మాటను బయట పెట్టిన రవీనా టాండన్  తెలుగు సినిమా
    పొన్నియన్ సెల్వన్ 2 సినిమా చూసేముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు  సినిమా రిలీజ్
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023