Page Loader
ఆదిపురుష్ కొత్త పోస్టర్ రిలీజ్: సీత కళ్ళలో కన్నీరు 
ఆదిపురుష్ సినిమాలో సీతగా క్రితిసనన్

ఆదిపురుష్ కొత్త పోస్టర్ రిలీజ్: సీత కళ్ళలో కన్నీరు 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 29, 2023
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఇతిహాసమైన రామాయణాన్ని ఆదిపురుష్ సినిమాతో వెండితెర మీద ఆవిష్కరించబోతున్నాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో క్రితిసనన్ సీతగా కనిపిస్తుంది. ఇదివరకు రాముడిగా ప్రభాస్ ఫోటోలను రిలీజ్ చేసిన చిత్రబృందం, తాజాగా సీత పాత్రలోని క్రితిసనన్ ఫోటోను బయటపెట్టింది. అంతేకాదు ఒక చిన్నపాటి వీడియోను కూడా రిలీజ్ చేసారు. ఈ వీడియోలో సీతమ్మ కళ్లలోంచి కన్నీరు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. పాపిట సింధూరం, నుదుటన బొట్టు, తలమీద దుపట్టా వేసుకుని కళ్ళలో నీళ్ళతో కనిపించింది. టీ సిరీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16వ తేదీన థియేటర్లలో విడుదల అవుతుంది.

Embed

సీత పాత్రలో క్రితిసనన్ 

सीता राम चरित अति पावन The righteous saga of Siya Ram Jai Siya Ram जय सिया राम జై సీతారాం ஜெய் சீதா ராம் ಜೈ ಸೀತಾ ರಾಮ್ ജയ് സീതാ റാം#Adipurush #SitaNavmi #Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage... pic.twitter.com/vS1t9wdcic— Om Raut (@omraut) April 29, 2023