LOADING...
NC24: దక్షగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్‌ విడుదల.. మిస్టరీ లుక్‌తో ఆకట్టుకున్న నటి
దక్షగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్‌ విడుదల.. మిస్టరీ లుక్‌తో ఆకట్టుకున్న నటి

NC24: దక్షగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్‌ విడుదల.. మిస్టరీ లుక్‌తో ఆకట్టుకున్న నటి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 04, 2025
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా ప్రముఖ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మీనాక్షి చౌదరి మరో ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ చైతన్య హీరోగా, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌కు తాత్కాలికంగా 'NC24'అనే టైటిల్‌ను నిర్ణయించారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె 'దక్ష' అనే పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించబోతోంది. పోస్టర్‌లో చీకటి గుహలో ఏదో రహస్యాన్ని అన్వేషిస్తున్న మీనాక్షి లుక్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె ముఖంలోని గంభీరత, చుట్టూ ఉన్న మిస్టీరియస్ వాతావరణం ఈ సినిమాకు ప్రత్యేకమైన రహస్యభరిత టోన్‌ను అందించాయి. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Details

 ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో  భారీ అంచనాలు

సుకుమార్ సమర్పణలో రూపొందుతోంది. ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తుండగా, ఆయన సౌండ్ డిజైన్ ఈ చిత్రానికి అదనపు బలం అందించనుంది. ఇక 'లాపాటా లేడీస్' ఫేమ్ నటుడు స్పార్ష్ శ్రీవాస్తవ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే కథ, టెక్నికల్ టీమ్, నటీనటుల కాంబినేషన్‌ కారణంగా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మీనాక్షి చౌదరి ఇప్పటివరకు గ్లామరస్‌ రోల్స్‌లో ఎక్కువగా కనిపించినా, ఈసారి ఆమె పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది. 'దక్ష' పాత్ర ద్వారా ఆమె నటనలో కొత్త కోణాన్ని చూపించబోతోందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.