Daler Mehndi: ఉత్తరాఖండ్ వివాదంపై దలేర్ మెహందీ భావోద్వేగ పోస్ట్.. అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ ఉత్తరాఖండ్ వివాదంపై స్పందించారు. తన ప్రదర్శన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై దీపావళి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు, సంగీత పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపారు.
వివరాలు
అభిమానుల ప్రేమకు ఫిదా.. ధన్యవాదాలు తెలిపిన గాయకుడు
''ఇన్నేళ్లుగా మీరు నన్ను ఆదరిస్తున్నారు. నేను ప్రదర్శనలు ఇచ్చిన ప్రతి వేదికపై ఎంతో ప్రేమను అందించారు.
కానీ ఇటీవల నేను ఎదుర్కొన్న అనుభవం మాత్రం మాటల్లో చెప్పలేనంతగా బాధపెట్టింది.
ఈ సమయంలో మీరు నాకు అండగా నిలిచిన తీరు, నా తరఫున మాట్లాడిన విధానం, నాపై చూపించిన నమ్మకం, ప్రేమ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి.
మీ సందేశాలన్నీ చదివాను. నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది'' అని దలేర్ మెహందీ పేర్కొన్నారు.
వివరాలు
కుటుంబమే అతిపెద్ద బలం.. సంగీత ప్రపంచానికి కృతజ్ఞతలు
'ఆ సమయంలో నా కుటుంబమే నాకు అతిపెద్ద బలంగా మారింది. నా సోదరుడు నాకు అండగా నిలబడ్డాడు. మొత్తం సంగీత ప్రపంచం నా కోసం నిలబడింది.
ఇలాంటి వారు నా పక్కన ఉన్నందుకు ఎంతో అదృష్టవంతుడిని. ఒక కళాకారుడి ప్రయాణం గురించి, ఆయన సాధించిన విజయాల గురించి ఆయన ఈ లోకంలో లేనప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటారు.
కానీ, నేను బతికుండగానే ఈ ప్రేమను చూడగలిగాను. ప్రతి సందేశానికి సమాధానం ఇవ్వలేకపోయి ఉండొచ్చు.
కానీ మీ ప్రేమను, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు
వివరాలు
తెలుగులోనూ ఎన్నో హిట్ సాంగ్స్
తనదైన పాటలతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను అలరించిన దలేర్ మెహందీ తెలుగులోనూ పలు హిట్ సాంగ్స్ పాడారు.
రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమాలోని 'జరగండి.. జరగండి', 'బాహుబలి 2'లోని 'సాహోరే బాహుబలి', 'బాద్‌షా' చిత్రంలోని 'బంతి పూల జానకి' పాటలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.