Page Loader
Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్‌ దర్శనం.. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రభాస్ ఎంట్రీ!
ఎన్నాళ్లకు డార్లింగ్‌ దర్శనం.. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రభాస్ ఎంట్రీ!

Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్‌ దర్శనం.. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రభాస్ ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

రెబల్ స్టార్ ప్రభాస్‌ ని అభిమానులు ముద్దుగా పేరు డార్లింగ్‌ అని పిలుస్తారు. తన సినిమాల ప్రచార వేళ తప్ప, ఎక్కువగా బయట కనిపించని ప్రభాస్‌ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ప్రైవేట్‌గా ఉంచే వ్యక్తి. ఫిల్మీ ఈవెంట్స్‌, పార్టీలకు దూరంగా ఉండే ఆయన, సాధారణంగా తన సన్నిహితుల మధ్యే సమయాన్ని గడుపుతుంటాడు. సినిమా రిలీజ్ రోజైనా తనను ఎవరూ కలవలేరు, పూర్తిగా తన స్పేస్‌లోకి వెళ్లిపోతాడు. అయితే, అలాంటి డార్లింగ్ ప్రభాస్ ఎన్నాళ్లకెన్నాళ్లకు ప్రేక్షకుల మద్యలో కనిపించడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. తాజాగా హాలీవుడ్ బిగ్ బ్లాక్‌బస్టర్ 'F1'సినిమాను హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో వీక్షించేందుకు వచ్చాడు.

Details

సోషల్ మీడియాలో ఫోటో వైరల్

ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా దూసుకుపోతోంది. బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్‌ తన స్నేహితుడు, 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు వచ్చాడు. ఎప్పుడూ మీడియా కళ్లకు దూరంగా ఉండే ప్రభాస్‌ హఠాత్తుగా మల్టీప్లెక్స్‌లో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రభాస్‌ను ఓ అభిమాని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ ఫోటో క్షణాల్లోనే వైరల్ అయింది. 'ఎన్నాళ్లకు ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూస్తున్నావ్ డార్లింగ్' అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.