దసరా ట్రైలర్: పుష్పతో పోలికపై స్పందించిన నాని
నేచురల్ స్టార్ నాని, దసరా సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. తన కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన దసరా ప్రమోషన్లను ఇండియా లెవెల్లో చేస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్ వేడుకను లక్నోలో జరుపుకోవడంతో దసరా సినిమా ప్రమోషన్లపై నాని ఎంత దృష్టి పెట్టాడో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ రిలీజ్ అనంతరం, బాలీవుడ్ మీడియాతో ముచ్చటించాడు నాని. దసరా ట్రైలర్ లో నాని లుక్, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ మాదిరిగా ఉందని చాలామంది భావించారు. అదే ప్రశ్నను బాలీవుడ్ మీడియా నానిని అడిగింది. దానికి సమాధానంగా నాని మాట్లాడుతూ, లుంగీ, జుట్టు తప్ప పుష్పతో పోలికేం లేదనీ, సినిమా చూసాక మీకు దసరా లుక్ గుర్తుండిపోతుందని అన్నాడు.
ఉత్తరాదిన దక్షిణాది సినిమాల ఆధిపత్యంపై నాని సమాధానం
దసరా సినిమా ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుందని, మీరు మరో ప్రపంచాన్ని చూస్తారని అన్నాడు నాని. ఆ తర్వాత, ఉత్తరాదిన దక్షిణాది సినిమాల ఆధిపత్యం గురించి ఏమంటారని మీడియా ప్రశ్నించగా, తన చిన్నప్పుడు హైదరాబాద్ లో చాలా హిందీ సినిమాలు రిలీజ్ అయ్యేవనీ, అలాగే ఇప్పుడు ఉత్తరాదిన తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని, సో.. బ్యాలన్స్ ఐపోయిందనీ అన్నాడు. మొత్తానికి దసరా సినిమా మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించింది. సంతోష్ నారయణన్ సంగీతం అందించిన ఈ సినిమా, మార్చ్ 30న విడుదల అవుతోంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి