Page Loader
దసరా ట్రైలర్: ఇప్పటివరకు కనిపించని రీతిలో నాని విశ్వరూపం
దసరా ట్రైలర్ విడుదల

దసరా ట్రైలర్: ఇప్పటివరకు కనిపించని రీతిలో నాని విశ్వరూపం

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 14, 2023
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన దసరా మూవీ ట్రైలర్, ఇప్పుడే రిలీజైంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లో నాని కొత్తగా కనిపించాడు. కొత్తగా అంటే అంతా ఇంతా కాదు, మొదట్లో మందు తాగి అల్లరి చిల్లర పనులు చేసే గోదావరి ఖని కుర్రాడిగా, ఆ తర్వాత తనకు నష్టం చేసిన వారి అంతు చేసే వాడిగా యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించి అదరగొట్టాడు. చివర్లో కీర్తి సురేష్ వైపు ప్రేమగా చూస్తూ, గుండెల్లోని ప్రేమ మొత్తాన్ని కళ్ళతోనే అందరికీ చూపించాడు. ఈ సినిమాలో కామెడీ, యాక్షన్, ఎమోషన్.. ఈ మూడూ ఉన్నాయని పై మూడు ఉదాహరణలు తెలియజేస్తున్నాయి.

దసరా ట్రైలర్

ట్రైలర్ కే హైలైట్ గా కీర్తి సురేష్ కనిపించే షాట్

దసరా చిత్ర కథ ,తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో జరుగుతుందని తెలిసిందే. ఆ నేపథ్యాన్ని మొదటి షాట్ తోనే బతుకమ్మ పండగను చూపించి తెలియజేసాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆ తర్వాత కీర్తి సురేష్ ని చూపించే షాట్ చాలా బాగుంది. కళ్ళు మూసుకున్నప్పుడు సాధారణంగా ఉండే అమ్మాయి, కళ్ళు తెరవగానే పెళ్ళికూతురులా మారిపోయినట్లు చూపించే షాట్, ఈ ట్రైలర్ కే హైలైట్. ఇక నాని విషయానికి వస్తే, ఊర మాస్ కంటే ఇంకా పెద్ద పదం ఏదైనా ఉంటే ఆ పదమే సరిపోతుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న దసరా మూవీ, మార్చ్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దసరా ట్రైలర్ విడుదల