LOADING...
Sathileelavathi: 'సతీ లీలావతి' టీజర్‌కు డేట్ అండ్ టైమ్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే?
'సతీ లీలావతి' టీజర్‌కు డేట్ అండ్ టైమ్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే?

Sathileelavathi: 'సతీ లీలావతి' టీజర్‌కు డేట్ అండ్ టైమ్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సతీ లీలావతి'.. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ముమ్మరంగా ఉంది. ఈ చిత్రానికి సత్య దర్శకత్వం వహించగా, దేవ్ మోహన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను జూలై 29వ తేదీ ఉదయం 10:30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక ఆకట్టుకునే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

Details

సంగీతాన్ని అందించనున్న మిక్కీ జే మేయర్

చిత్రంలో లావణ్య - దేవ్ మోహన్‌ల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్, అలాగే హాస్యభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. టీజర్ మాత్రం ఫుల్ ఫన్ రైడ్‌గా ఉండబోతోందని వారు ధీమాగా తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు నాగ మోహన్ వహిస్తున్నారు. కొన్నేళ్లుగా సీరియస్ రోల్స్‌లో కనిపించిన లావణ్య త్రిపాఠి, ఈ సినిమాతో మళ్లీ ఫన్ అండ్ ఫ్రెష్ గ్లామర్ లుక్‌లో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఇక టీజర్‌కు మరికొన్ని గంటలే మిగిలుండటంతో అభిమానులు టీజర్ ఎలా ఉంటుందో అనే కుతూహలంతో ఎదురుచూస్తున్నారు.