NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నేనెప్పుడూ చేయనిది, మీరెప్పుడూ చూడనిది కనిపించే సమయం వచ్చేసిందంటున్న అల్లరి నరేష్
    తదుపరి వార్తా కథనం
    నేనెప్పుడూ చేయనిది, మీరెప్పుడూ చూడనిది కనిపించే సమయం వచ్చేసిందంటున్న అల్లరి నరేష్
    ఫిబ్రవరి 22వ తేదీన ఉగ్రం టీజర్ రిలీజ్

    నేనెప్పుడూ చేయనిది, మీరెప్పుడూ చూడనిది కనిపించే సమయం వచ్చేసిందంటున్న అల్లరి నరేష్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 21, 2023
    01:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తన పాత పంథాను పక్కనపెట్టి కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు అల్లరి నరేష్. ఆ క్రమంలోనే నాంది సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.

    ఆ తర్వాత వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ మరోమారు అదే దారిలో ఉగ్రం అంటూ వస్తున్నాడు.

    నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందిస్తున్న ఉగ్రం చిత్రంలో మలయాళీ భామ మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి అప్డేట్ బయటకు వచ్చింది.

    ఉగ్రం మూవీ టీజర్, ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 11:34 గంటలకు రిలీజ్ అవుతుందని ప్రకటించారు.

    ఈ మేరకు అల్లరి నరేష్ ట్వీట్ చేస్తూ, నేనెప్పుడూ చేయని పాత్రలో, మీరెప్పుడు చూడని పాత్రలో కనిపిస్తున్నానని అన్నాడు.

    అల్లరి నరేష్

    టీజర్ రిలీజ్ పోస్టర్లో సీరియస్ గా కనిపిస్తున్న అల్లరి నరేష్

    టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ పోస్టర్లో అల్లరి నరేష్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా మీద అటు జనాల్లో ఇటు పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి. నాంది సినిమా కాంబినేషన్ మళ్ళీ ఈ సినిమాతో రిపీట్ అవుతుండడంతో అంచనాలు పెరిగాయి.

    మరి ఆ అంచనాలను అల్లరి నరేష్, విజయ కనకమేడల నిజం చేస్తారో లేదో చూడాలి.

    తూము వెంకట్, అబ్బూరి రవి.. ఉగ్రం సినిమాకు కథను అందించారు.

    సాహు గారపాఠి, హరీష్ పెద్ది నిర్మాతలుగా షైన్ స్క్రీన్ బ్యానర్ లో రూపొందుతోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్న ఈ సినిమా మే 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    IATA : ఖర్చులు పెరిగినా, టికెట్ ధరలు తగ్గాయి.. 10 ఏళ్లలో 40% తగ్గిన విమానయాన వ్యయం  విమానం
    Aadhaar Address Update: ఉచితంగా ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? ఈ స్టెప్స్‌ ఫాలో అయితే సరి! ఆధార్ కార్డ్
    #NewsBytesExplainer: తెలుగు సినితెలుగు సినిమాల రీ-రిలీజ్‌లలో హీరోల పరువు తీసేలా అభిమానుల ఉన్మాదం ? సినిమా

    తెలుగు సినిమా

    మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ సినిమా
    థియేటర్స్ లో ఇచ్చిపడేసేందుకు కాస్త లేట్ అవుతుందంటున్న విశ్వక్ సేన్ సినిమా రిలీజ్
    టికెట్ లేకుండా సినిమా చూడొచ్చంటున్న రైటర్ పద్మభూషణ్ టీమ్ సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ ట్రైలర్ టాక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025