Loading...
Preity Zinta: ప్రీతి జింటాతో డేటింగ్‌? ఎట్టకేలకు అసలు నిజం చెప్పిన బ్రెట్‌ లీ!
ప్రీతి జింటాతో డేటింగ్‌? ఎట్టకేలకు అసలు నిజం చెప్పిన బ్రెట్‌ లీ!

Preity Zinta: ప్రీతి జింటాతో డేటింగ్‌? ఎట్టకేలకు అసలు నిజం చెప్పిన బ్రెట్‌ లీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2026
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో తనకు ప్రేమ వ్యవహారం ఉందంటూ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రచారంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ ఎట్టకేలకు స్పందించాడు. తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని, ప్రీతి తనకు ఎప్పటికీ మంచి స్నేహితురాలేనని స్పష్టం చేశాడు. ఆమెపై తనకు అపారమైన గౌరవం ఉందని వెల్లడించాడు. ఇటీవల బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్ లీ ఈ అంశంపై మాట్లాడాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా యజమానిగా ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి తరచూ కనిపించడంతో తమపై అనేక కథనాలు వెలువడ్డాయని గుర్తు చేసుకున్నాడు. నేను ఎప్పుడూ ఏ బాలీవుడ్ నటితోనూ డేటింగ్ చేయలేదు. ప్రీతి ఎప్పుడూ నా మంచి స్నేహితురాలే.

వివరాలు

ఆమెపై నాకు ఎంతో గౌరవం ఉంది

ఇప్పటికీ మా స్నేహం కొనసాగుతోంది. ఆమె చాలా తెలివైన మహిళ. ఆమెపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి ప్రచారాలు నన్నెప్పుడూ ప్రభావితం చేయలేదు.

నిజం నాకు తెలుసు. ఎవరు ఏం అనుకున్నా నేను పట్టించుకోలేదు'' అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. 2008నుంచి 2011 వరకు బ్రెట్ లీ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన సమయంలో ఈ ప్రచారం ఎక్కువగా వినిపించింది.

ముఖ్యంగా ముంబైలోని ఓ రెస్టారెంట్ వద్ద ఇద్దరూ కలిసి కనిపించిన తర్వాత ప్రేమలో ఉన్నారనే వార్తలు మరింత జోరందుకున్నాయి.

అయితే ఈ ప్రచారాన్ని ప్రీతి జింటా ఇప్పటికే 2010లోనే ఖండించింది. ''ప్రతి ఏడాది బ్రెట్ లీతో నేను ప్రేమలో ఉన్నానని వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో ఎలాంటి నిజం లేదు.

వివరాలు

బట్వారా చిత్రంలో నటిస్తోన్న ప్రీతి జింటా

మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే'' అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చింది.

ఇక బ్రెట్ లీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన 2006లో ఎలిజబెత్ కెంప్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు.

అయితే రెండేళ్లకే ఇద్దరూ విడిపోయి, 2009లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం 2014లో లానా ఆండర్సన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరోవైపు ప్రీతి జింటా 2016లో అమెరికాకు చెందిన జీన్ గుడ్‌ఇనఫ్‌ను వివాహం చేసుకుంది. అనంతరం 2021లో సరోగసీ ద్వారా కవలలకు తల్లైంది.

ప్రస్తుతం ప్రీతి జింటా 'బట్వారా 1947' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT