
David Warner: 'రాబిన్‌హుడ్' ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న డేవిడ్ వార్నర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) 'రాబిన్‌హుడ్' (Robinhood) సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు.
శనివారం నగరానికి చేరుకున్న వార్నర్‌కు చిత్రబృందం ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం పలికింది. సాయంత్రం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వార్నర్ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా సినిమాలో తన పాత్ర గురించి, షూటింగ్ అనుభవాల గురించి మాట్లాడనున్నారు.
సినిమాలో వార్నర్ స్పెషల్ రోల్ క్రికెట్ మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వార్నర్.. తెలుగు సినిమాలకు ప్రత్యేకంగా అభిమానిగా మారిన సంగతి తెలిసిందే.
తెలుగు పాటలు, డైలాగ్‌లకు సరదాగా వీడియోలు చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటారు.
Details
వార్నర్ పాత్రపై హీరో నితిన్ కామెంట్
సినిమాలో వార్నర్ పాత్రపై హీరో నితిన్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ''మా సినిమాలో డేవిడ్ పాత్ర చాలా ప్రత్యేకం. సినిమా ఆరంభం నుంచీ ఆ పేరు వినిపిస్తూనే ఉంటుంది.
ఆ రోల్ కోసం ఎవరిని తీసుకోవాలా అని ఆలోచించినప్పుడు, దర్శకుడు వెంకీ కుడుములకు డేవిడ్ వార్నర్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది. వెంటనే ఆయన్ను సంప్రదించాం.
పాత్ర గురించి చెప్పగానే ఆయన వెంటనే అంగీకరించారు. ప్రేక్షకులు ఆ పాత్రను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సెకండాఫ్‌లో వార్నర్ ఎంట్రీ అదిరిపోతుంది'' అని నితిన్ తెలిపారు.
'భీష్మ' తర్వాత వెంకీ కుడుముల, నితిన్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా మార్చి 28న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.