LOADING...
December Movies: డిసెంబర్‌లో సినిమాల పండుగే.. ఈనెల 5 నుంచి 25 వరకు భారీ ఎంటర్టైనర్స్ మూవీస్ హంగామా!
డిసెంబర్‌లో సినిమాల పండుగే.. ఈనెల 5 నుంచి 25 వరకు భారీ ఎంటర్టైనర్స్ మూవీస్ హంగామా!

December Movies: డిసెంబర్‌లో సినిమాల పండుగే.. ఈనెల 5 నుంచి 25 వరకు భారీ ఎంటర్టైనర్స్ మూవీస్ హంగామా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2025
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 చివరి త్రైమాసికంలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వరుసగా పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ మొదటి వారం నుంచే 'అఖండ 2: తాండవం' విడుదలతో బాక్సాఫీసు వద్ద సందడి మొదలుకానుంది. క్రిస్మస్ సమయానికి మధ్యస్థాయి సినిమాల హవా ఉండనున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. మరి ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి?

Details

బాలకృష్ణ, రణ్‌వీర్ సింగ్ - డిసెంబర్ 5న డబుల్ ధమాకా

'సింహా', 'లెజెండ్' తరువాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ విజయం సాధించిన 'అఖండ'కు కొనసాగింపుగా 'అఖండ 2: తాండవం' రూపొందింది. సనాతన ధర్మం ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ పార్ట్ 2లో సంజుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. అదే రోజున మరో భారీ హిందీ చిత్రం రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ సినిమాలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలు పోషించారు. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందింది.

Details

డిసెంబర్ రెండో వారం — యువ హీరోల ఎంట్రీ 

రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ మూవీ 'మోగ్లీ' డిసెంబర్ 12న విడుదల కానుంది. సాక్షీ సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా నటించింది. అదే రోజు రామ్ కిరణ్ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సఃకుటుంబానాం' రిలీజ్ అవుతుంది. మేఘా ఆకాశ్ హీరోయిన్. దర్శకత్వం: ఉదయ్ శర్మ. క్రిస్మస్ వారం — సైన్స్ ఫిక్షన్, స్పోర్ట్స్, గ్రామీణ కథల పండుగ ఆది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని తెరకెక్కించిన సైన్స్-అతీంద్రియ నేపథ్య చిత్రం 'శంబాల' డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆది శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. అర్చన అయ్యర్, శ్వాసిక కీలక పాత్రలు.

Advertisement

Details

డిసెంబర్ 25న దండోరా

అలాగే, శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన స్పోర్ట్స్-డ్రామా 'ఛాంపియన్' కూడా అదే రోజు విడుదలవుతోంది. ఫుట్‌బాల్ నేపథ్యంతో, ప్రేమ-దేశభక్తి అంశాలతో దర్శకుడు ప్రదీప్ అద్వైత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 25న విడుదలకానున్న మరో సినిమా 'దండోరా'. శివాజీ, నవదీప్, బిందుమాధవి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మురళీకాంత్ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. ధర్మేంద్ర చివరి చిత్రం- 'ఇక్కీస్' ఇటీవల మరణించిన నటుడు ధర్మేంద్ర నటించిన చివరి సినిమా'ఇక్కీస్'ఈ క్రిస్మస్‌కు రానుంది. పరమవీర చక్ర అవార్డు గ్రహీత, రెండో లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ జీవితచరిత్రాత్మక చిత్రంలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద ప్రధాన పాత్ర పోషించారు.

Advertisement

Details

ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న 'అవతార్ 3' 

జేమ్స్ కామెరూన్ రూపొందించిన విజువల్ వండర్ 'అవతార్' సిరీస్‌లో మూడో భాగం 'అవతార్ - ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పాండోరా గ్రహం నేపథ్యంతో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందించిన ఈ భాగం అగ్ని (ఫైర్ ఎలిమెంట్) కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుంది.

Advertisement