Page Loader
John Amos: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూత 
హాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూత

John Amos: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జాన్ అమోస్ వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. 84 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాన్ అమోస్ ఆగస్టు 21న మరణించినా, ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అక్టోబర్ 1న అధికారికంగా ప్రకటించారు. టెలివిజన్ సిరీస్ 'గుడ్ టైమ్స్‌'తో బాగా ప్రాచుర్యం పొందిన అమోస్, 50 ఏళ్లకుపైగా ఫిల్మ్, టెలివిజన్ రంగాల్లో అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను మెప్పించారు. జాన్ అమోస్ తన జీవితంలో రెండు వివాహాలు చేసుకోగా. ఇద్దరు సంతానం ఉన్నారు.

Details

సోషల్ మీడియాలో ప్రముఖుల సంతాపం

1939 డిసెంబర్ 27న జన్మించిన అమోస్, 1971లో సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2023 వరకు సినిమాలు, టీవీ సిరీస్‌లలో నిరంతరం నటిస్తూ, అభిమానులను అలరించారు. ఇక 1977లో వచ్చిన 'రూట్స్', 'గుడ్ టైమ్స్' సిరీస్‌లతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన అమోస్, మొత్తం 50కి పైగా సినిమాల్లో, 100కు పైగా సీరియల్స్‌లో నటించారు. 2022లో 'ది రైటోస్ జెమ్ స్టోన్స్' సిరీస్‌లో అతను చివరిసారిగా నటించారు. జాన్ అమోస్ మరణ వార్త తెలిసిన అభిమానులు, హాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.