LOADING...
 Nandamuri Family : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం.. ఆ హీరో తల్లి ఇక లేరు
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం.. ఆ హీరో తల్లి ఇక లేరు

 Nandamuri Family : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం.. ఆ హీరో తల్లి ఇక లేరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ(73) ఇవాళ కన్నుమూశారు. నందమూరి జయకృష్ణ - పద్మజల కుమారుడు చైతన్య కృష్ణ గతంలో ధమ్, బ్రీత్ వంటి చిత్రాల్లో హీరోగా నటించి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పద్మజకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలోనే ఆమె తుది శ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఈ విషాదకర వార్త తెలిసిన వెంటనే విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న మిగిలిన నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాదుకు బయలుదేరారు.