Zakir Hussain: తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 15, 2024
10:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని ఓ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆదివారం అస్వస్థతకు గురైన ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. ఆయన మృతితో అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. భారతీయ చలన చిత్ర రంగంలో ఆయన ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. ముంబైలో జన్మించిన ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పలు అవార్డులను అందుకున్నారు.