Page Loader
ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం
ఆస్కార్ అవార్డ్ ప్రెజెంటర్ గా దీపికా పదుకునే కు ఆహ్వానం

ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 03, 2023
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈసారి భారతీయులకు ఆస్కార్ అవార్డ్స్ మంచి మంచి అనుభూతులను పంచేలా ఉన్నాయి. 95వ ఆస్కార్ అవార్డులను భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేనంతగా మారేలా కనిపిస్తున్నాయి. దానికి కారణంగా, నామినేషన్లలో నిలిచిన ఆర్ఆర్ఆర్, ఆల్ దట్ బ్రీత్స్, ద ఎలిఫెంట్ విష్పర్స్ ఉన్నాయి. ఈ మూడింటిలో ఏ ఒక్కదానికైనా ఆస్కార్ అవార్డ్ వస్తుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు అవార్డు వస్తుందని నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆస్కార్ అవార్డుల వేడుకలకు బాలీవుడ్ భామ దీపికా పదుకునేకు ఆహ్వానం అందింది. అవును, ఆస్కార్స్ అవార్డును అందజేసే ప్రెజెంటర్ గా దీపికా పదుకునే కు ఆహ్వానం అందింది. దీంతో దీపికా అభిమానులు సంతోషంగా ఉన్నారు.

ఆస్కార్ అవార్డ్స్

హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునే

హాలీవుడ్ సెలెబ్రిటీలైన ఎమిలీ బ్లంట్, జెన్నీఫర్ కోనెల్లీ, అరియానా డీబోస్, శామ్యూల్ జాక్సన్ మొదలగు వారందరూ ప్రెజెంటర్లుగా ఉన్నారు. వాళ్ళందరిలో దీపికా పదుకునే ఉంది. ఈ మేరకు అకాడమీ అవార్డ్స్, ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చ్ 12వ తేదీన లాస్ ఏంజిల్స్ లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం, మార్చ్ 13వ తేదీన ఉదయం 5:30గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. మరి ఆస్కార్ వేడుకల్లో అందరూ అనుకుంటున్నట్టుగా ఇండియాకు అవార్డు వస్తుందా లేదా చూడాలి. అదలా ఉంచితే, దీపికా పదుకునే ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె మూవీలో నటిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, 2024 జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆస్కార్ అవార్డ్ ప్రెజెంటర్ గా దీపికా పదుకునే కు ఆహ్వానం