Kalki2898AD : 'కల్కి-2'లో దీపికా అవుట్, సాయి పల్లవి ఇన్!
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ విజువల్ ఎపిక్ 'కల్కి' తొలి భాగంలో కీలకమైన సుమతి (సమ్-80) పాత్రను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పోషించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర చుట్టూనే కథ మొత్తం సాగుతూ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కల్కి 2'ను రూపొందించేందుకు నాగ్ అశ్విన్ సిద్ధమవుతున్నారు. అయితే సీక్వెల్ షూటింగ్‌కు సంబంధించి కాల్షీట్ల సమస్యలతో పాటు మరికొన్ని కారణాల వల్ల దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో సుమతి పాత్రకు కొత్త హీరోయిన్ ఎంపికపై కొంతకాలంగా అనిశ్చితి నెలకొంది.
Details
అధికారిక ప్రకటన వెలువడలేదు
ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా పేర్లు వినిపించినా... వాటిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. తాజాగా లభిస్తున్న సమాచారం ప్రకారం ఈ కీలక పాత్రకు సాయి పల్లవి ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ సరసన సాయి పల్లవి ఫిక్స్ అయినట్టేనని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. సాయి పల్లవి నటన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమతి పాత్రలోని భావోద్వేగాలు, ఇంటెన్సిటీని ఆవిష్కరించడంలో ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.
Details
ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు
పార్ట్-2లో ప్రభాస్ (భైరవ) పాత్రకు, సాయి పల్లవి పోషించనున్న సుమతి పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా పదుకొనే వంటి గ్లోబల్ స్టార్ స్థానంలో సాయి పల్లవి రావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ట్రేడ్ సర్కిల్స్‌లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.