Deepika Padukone: యువతకు బంపర్ ఆఫర్.. 'ఆన్‌సెట్ ప్రోగ్రామ్' ప్రకటించిన దీపిక పదుకొణె
ఈ వార్తాకథనం ఏంటి
సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవాలని, తెరవెనుక ఉండి తమ ప్రతిభతో మాయ చేయాలని ఎంతో మంది యువత కలలు కంటుంటారు. అలాంటి ఆశావహుల కోసం బాలీవుడ్ స్టార్ దీపిక పదుకొణె ఓ కీలక ప్రకటన చేశారు. తన 40వ పుట్టినరోజు సందర్భంగా 'ది ఆన్‌సెట్ ప్రోగ్రామ్' (The Onset Program) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆమె ప్రారంభించారు. చదువు పూర్తై ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న యువతకు, అలాగే సినీ రంగంలో తమ టాలెంట్‌ను ప్రదర్శించాలని కోరుకునే వారికి ఈ కార్యక్రమం నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్‌గా మారింది.
Details
యువ టాలెంట్ ను ప్రోత్సహించాలి
ఇంతకీ ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత ఏమిటంటే.. చాలామందికి కథలు రాయడం, కెమెరా ఆపరేట్ చేయడం, డైరెక్షన్, మేకప్, కాస్ట్యూమ్స్ వంటి విభాగాల్లో మంచి నైపుణ్యం ఉంటుంది. అయితే సినీ పరిశ్రమలోకి ఎలా అడుగుపెట్టాలన్న దారితెలియక చాలా మంది వెనుకబడిపోతుంటారు. అలాంటి యువ ప్రతిభావంతుల కోసమే దీపిక ఈ వేదికను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ టాలెంట్‌ను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించాలన్న ఆలోచన నాకు గతేడాదే వచ్చింది. ఇప్పుడు ఆ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది' అంటూ దీపిక ఓ వీడియో ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Details
ప్రముఖ టెక్నీషియన్లతో కలిసి పనిచేసే అవకాశం
ఈ ప్రోగ్రామ్‌లో చేరాలని ఆసక్తి ఉన్నవారు వెంటనే 'onsetprogram.in' వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ వ్యక్తిగత వివరాలతో పాటు తాము చేస్తున్న పనికి సంబంధించిన శాంపిల్స్‌ను అక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ పనిలో ప్రతిభ కనిపిస్తే, సినీ పరిశ్రమలోని ప్రముఖ టెక్నీషియన్లతో కలిసి పనిచేసే అవకాశం లభించనుంది. ఈ కార్యక్రమం కేవలం నటనకే పరిమితం కాకుండా, రైటింగ్, ప్రొడక్షన్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, మేకప్ వంటి అన్ని విభాగాల్లో శిక్షణను అందించనుంది. కాబట్టి మీలో టాలెంట్ ఉందని నమ్మకం ఉంటే, ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దీపిక యువతను ప్రోత్సహించారు.