Deepika Padukone: 'కొన్ని నిర్ణయాలు బాధపెట్టాయి'.. దీపిక ఎమోషనల్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి బహిరంగంగా మాట్లాడింది. 'ఓం శాంతి ఓం'తో అద్భుతమైన ఆరంభం చేసిన ఆమె, 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'పద్మావత్', 'పఠాన్', 'కల్కి 2898 ఏడి' వంటి భారీ విజయాలు అందుకున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో కథల సెలెక్షన్‌లో చేసిన పొరపాట్లు తనను బాధపెడుతున్నాయని చెప్పింది.
వివరాలు
ఆ మాట ఖచ్చితంగా నిజం కాదు
దీపికా మాట్లాడుతూ.. కొన్ని సార్లు నా పాత సినిమాలు గుర్తొస్తే నిజంగా బాధగా ఉంటుంది. ఎంచుకున్న కొన్ని కథలు నాకు మంచి అనుభవం ఇవ్వలేదు. నేను చేసిన ప్రతీ సినిమా విజయవంతం కాలేదు... కొన్ని పూర్తిగా నిరుత్సాహపరిచాయి" అని ఆమె తెలిపింది. అంతేకాదు, తాను డబ్బుకోసమే సినిమాలు చేస్తుందనే అభిప్రాయంపై స్పందిస్తూ... "ఆ మాట ఖచ్చితంగా నిజం కాదు. సినిమా పెద్దదా చిన్నదా, వాణిజ్యంగా విజయం సాధిస్తుందా లేదా ..ఇవన్నీ నా నిర్ణయాల్లో ప్రధాన కారణాలు కావు. నేను ఎక్కువగా కథలోని పాత్రలను, వాటిలోని భావోద్వేగాలను నమ్ముతాను. ఆ పాత్రను నిజాయితీగా ఆవిష్కరించగలనేమో అనిపిస్తేనే అంగీకరిస్తాను" అని చెప్పింది.
వివరాలు
అప్పుడు నేను ఎలాంటి తప్పులు చేసానా?
తన గత నిర్ణయాల్లో స్పష్టత తక్కువగా ఉండేదని అంగీకరించిన దీపికా... "ఇప్పుడేమో ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా, లోతుగా విశ్లేషించి ముందుకు వెళ్తాను. కొన్నిసార్లు వెనక్కి చూసుకుంటే 'అప్పుడు నేను ఎలాంటి తప్పులు చేసానా?' అని అనిపిస్తుంది. ఇవన్నీ నేర్చుకునే ప్రక్రియలో ఓ భాగమే. బహుశా వచ్చే దశాబ్దం తర్వాత ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా ఇదే ఆలోచన రావచ్చు" అని చెప్పింది.