Mahavatar: 'మహావతార్' మైథలాజికల్ డ్రామాలో దీపికా పదుకొణె? బాలీవుడ్‌లో జోరుగా చర్చలు!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె మరో భారీ చిత్ర ప్రాజెక్ట్‌లో చేరబోతున్నట్టుగా ఇండస్ట్రీలో హాట్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటించేందుకు సిద్ధమైన దీపిక... ఇప్పుడు మైథలాజికల్ ప్రాజెక్ట్ 'మహావతార్' లో కీలక పాత్రకు ఎంపిక కానున్నట్లు సమాచారం. తాజాగా 'స్త్రీ 2'తో ఘన విజయాన్ని అందుకున్న దర్శక-నిర్మాత అమర్ కౌశిక్, ఇప్పుడు నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి 'మహావతార్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పరశురాముడి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుండగా, ఇందులో దీపికా పదుకొణెను ప్రధాన పాత్రకు పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఆమెతో జరిగిన చర్చలు ఇప్పటికే ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్నాయని బీ-టౌన్ వర్గాలు వెల్లడించాయి.
Details
శరవేగంగా ఫ్రీ ప్రొడక్షన్ పనులు
సినిమాలో దీపిక పాత్రకు పెద్ద ప్రాధాన్యం ఉండడంతో, ఆమె ఈ రోల్‌కి పూర్తి న్యాయం చేస్తుందని టీమ్ నమ్మకంగా చూస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అమర్ కౌశిక్ 'మహావతార్' గురించి మాట్లాడుతూ దాదాపు ఆరు నెలలుగా ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నేను అరుణాచల్ ప్రదేశ్‌లో స్కూల్‌లో చదివే రోజుల్లో మా దగ్గర్లోనే పరశురామ్‌కుండ్ ఉండేది. అప్పట్లో అమ్మను తరచూ 'పరశురాముడు ఎవరు?' అని అడిగేవాణ్ణి. ఆయన చాలా కోపిష్టి యోధుడు అని మాత్రమే చెప్పేవారు.
Details
ప్రేక్షకుల్లో ఆసక్తి
ఆ పాత్ర అప్పుడే నన్ను బాగా ఆకర్షించింది. ఇప్పుడు VFX విషయంలో నాకు మంచి అవగాహన వచ్చింది. అదే ఈ సినిమా ప్రారంభించేందుకు నన్ను ధైర్యం చేసిందని తెలిపారు. దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, విక్కీ కౌశల్-దీపిక కాంబినేషన్‌పై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.