LOADING...
Deepika Padukone: మళ్లీ తెరపైకి 'కల్కి 2898 AD' వివాదం.. ఈ సారి పేరు మిస్సింగ్.. అన్‌ప్రొఫెషనల్ అంటూ ఫ్యాన్స్ రచ్చ
అన్‌ప్రొఫెషనల్ అంటూ ఫ్యాన్స్ రచ్చ

Deepika Padukone: మళ్లీ తెరపైకి 'కల్కి 2898 AD' వివాదం.. ఈ సారి పేరు మిస్సింగ్.. అన్‌ప్రొఫెషనల్ అంటూ ఫ్యాన్స్ రచ్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

కల్కి 2898 AD సీక్వెల్ నుంచి నటి దీపికా పదుకొణెను తప్పించడంతో మొదలైన వివాదానికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా లేదు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీల్లో ప్రసారం అవుతున్నా, తాజాగా మరోసారి కొత్త వివాదం తలెత్తింది. అక్టోబర్ 29 (బుధవారం) స్ట్రీమింగ్ వెర్షన్‌లో చూపించిన ఎండ్ క్రెడిట్స్‌లో దీపికా పేరు లేకపోవడం అభిమానుల దృష్టికి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో #DeepikaPadukone మళ్లీ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

వివరాలు 

'అన్‌ప్రొఫెషనల్' వ్యవహారం అంటూ విమర్శలు 

సినిమా పోస్టర్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లతో పాటు దీపికా ముఖం స్పష్టంగా ఉండగా, ఎండ్ క్రెడిట్స్‌లో ఆమె పేరు లేకపోవడం అభిమానుల్లో ఆగ్రహం రేపింది. ఎడిట్ చేసిన ఎండ్ క్రెడిట్స్ వీడియోలు, స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలామంది నెటిజన్లు నిర్మాతలపై విమర్శలు గుప్పిస్తూ, "ఇది చాలా అన్‌ప్రొఫెషనల్ వ్యవహారం" అని ట్వీట్లు చేస్తున్నారు.

వివరాలు 

దీపికా పాత్ర ఏంటి? 

కల్కి 2898 ఏ.డి ఒక భవిష్యత్తు నేపథ్యంతో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ - పౌరాణిక ఫాంటసీ చిత్రం. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా ప్రధాన తారాగణం. ఇందులో దీపికా 'సమ్-80' అనే గర్భిణీ మహిళ పాత్రలో కనిపిస్తుంది. ఆమెను ప్రభాస్ పోషించిన బౌంటీ హంటర్ వెంబడిస్తుండగా, అమితాబ్ బచ్చన్ నటించిన అశ్వత్థామ ఆమెను రక్షిస్తాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహాభారత కథాంశాలను సైన్స్ ఫిక్షన్ మేళవింపుతో రూపొందించి రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనికి సీక్వెల్ కూడా రాబోతోందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

వివరాలు 

క్రెడిట్స్‌లో మళ్లీ పేరు చేర్చారు 

బుధవారం ఉదయం అభిమానులు పంచుకున్న స్క్రీన్‌గ్రాబ్‌లలో దీపికా పేరు కనిపించకపోవడంతో గోల మొదలైంది. కానీ మధ్యాహ్నం నాటికి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న వెర్షన్‌లలో ఆమె పేరు అమితాబ్ బచ్చన్ పేరుకి కింద తిరిగి కనిపించిందని హిందూస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ఫ్యాన్స్ ఆగ్రహం క్రెడిట్స్ నుంచి దీపికా పేరు తొలగించారనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఫ్యాన్‌పేజీ వీడియో పంచుతూ,"కల్కి పార్ట్ 1 ఓటీటీ వెర్షన్‌లో దీపికా పదుకొణె పేరు తొలగించారు" అని పోస్ట్ చేసింది. ఇదే సమయంలో గత నెలలో వైజయంతీ మూవీస్, కల్కి సీక్వెల్‌లో దీపికా ఇక భాగం కాదని ప్రకటించిన విషయం గుర్తు చేస్తున్నారు అభిమానులు.

వివరాలు 

'8 గంటల పని' డిమాండ్ కారణమా? 

తాజా రిపోర్టుల ప్రకారం, పెరిగిన పారితోషికం, తక్కువ పని గంటల వంటి 'అన్‌ప్రొఫెషనల్ డిమాండ్స్' కారణంగానే దీపికాను కల్కి సీక్వెల్ నుంచి తప్పించారని సమాచారం. ఈ వివాదంపై వైజయంతీ మూవీస్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొత్త తల్లిగా దీపికా 8 గంటల షిఫ్ట్ మాత్రమే చేయగలనని చెప్పడంతో, ఇదే కారణంగా ఆమె సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' ప్రాజెక్ట్‌ నుంచి కూడా తప్పుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నటి షారుక్ ఖాన్‌తో 'కింగ్', అలాగే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో మరో సినిమాకు సన్నద్ధమవుతోంది.