
Deepika Padukone : ఆ కామెంట్‌తో డైరక్టర్‌ను అన్ ఫాలో చేసిన దీపికా పాదుకొణె
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో ఆమెకు చేదు అనుభవాలు ఎదురైన విషయం తెలిసిందే. స్పిరిట్, కల్కి 2898 AD చిత్రాల నుంచి ఆమెను తప్పించగా, దర్శకుడు సందీప్ వంగా కూడా ఆమెపై విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి దీపికా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్. తాజాగా ఫరాఖాన్, దీపికా ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ షోలో పాల్గొన్న ఫరాఖాన్, నటి వర్కింగ్ అవర్స్‌పై సరదాగా కామెంట్ చేశారు. దీపికా ఇప్పుడు రోజుకు 8 గంటలే పని చేస్తుంది.
Details
సరాదాగా అన్న వ్యాఖ్యలపై సీరియస్
ఇక ఈ షోకు ఎలా వస్తారు? ఆమెకు అంత సమయం ఎక్కడుందంటూ వ్యాఖ్యానించారు. ఫరాఖాన్ సరదాగా అన్న ఈ మాటలు బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. దీంతో అసహనం చెందిన దీపికా ఆమెను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఫరాఖాన్ కూడా దీపిక, ఆమె భర్త రణ్‌వీర్ సింగ్‌లను అన్‌ఫాలో చేశారు. వీరందరూ గతంలో కలిసి పలు ప్రాజెక్టులపై పని చేశారు. ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలను ఫరాఖాన్ దర్శకత్వం వహించగా, దీపిక ప్రధాన పాత్రల్లో నటించింది. ఆ తర్వాత నుంచి వారి మధ్య స్నేహం కొనసాగుతూ వచ్చింది. కానీ తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు దూరం చేసుకున్నట్లు కనిపిస్తోంది.