
Deepika Padukone:మరోసారి హాట్ కామెంట్స్ చేసిన దీపిక పదుకొనే.. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఎన్నోఏళ్లుగా 8 గంటలు పని చేస్తున్నారు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో అనేక స్టార్‌లు ఉన్నప్పటికీ, ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అసలు విషయం ఏమిటంటే, పని గంటల విషయంలో దీపికా కొన్ని కండీషన్స్ పెట్టడం కారణంగా ఆమెను రెండు పెద్ద ప్రాజెక్టుల నుంచి—"కల్కి","స్పిరిట్" లాంటి రెండు భారీ ప్రాజెక్టుల నుంచి ఆమెను తొలగించారు. ఇవి రెండు కూడా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలు కావడం గమనార్హం. దీని కారణంగా దీపికా పేరు ఒక్కసారిగా భారత సినీ ప్రపంచంలో ట్రెండ్‌లోకి వచ్చి, సోషల్ మీడియాలో ఆమెపై చర్చలు ఎక్కువయ్యాయి.
వివరాలు
సినీ పరిశ్రమలో అనేక మంది స్టార్‌లు సంవత్సరాలుగా రోజూ 8 గంటలు షూటింగ్
తాజాగా దీపికా ఈ విషయంపై స్పందించారు. ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'ఆత్మాభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బందిపెట్టే విషయాలను అంగీకరించలేను. భారత సినీ పరిశ్రమలో అనేక మంది స్టార్‌లు సంవత్సరాలుగా రోజూ 8 గంటలు షూటింగ్ చేస్తున్నారు. ఇది కొత్త విషయం కాదు, రహస్యం కూడా కాదు. కానీ ఇన్నేళ్లలో ఇది వార్తల్లోకి రాలేదు. వాళ్ల పేర్లు కూడా నేను చెప్పాలనుకోవడం లేదు. కొందరు వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్ చేయడం ఆచారంగా ఉంది. నాకు ఇది కొత్త విషయం కాదు, దీనిని చాలా సార్లు ఎదుర్కొన్నాను' అని చెప్పింది.
వివరాలు
దీపికా మరోసారి సోషల్ మీడియాలో వైరల్
'నేను ఎప్పుడూ ఏ విషయంపై ఓపెన్‌గా స్పందించను. నిశ్శబ్దంగా యుద్ధం చేయడమే నా విధానం. అలాంటి మార్గమే నాకు గౌరవంగా అనిపిస్తుంది'అంటూ చెప్పుకొచ్చింది దీపికా. ఈ వ్యాఖ్యలతో దీపికా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అయితే, దీపికా చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ వర్గాలు.. ప్రత్యేకంగా "కల్కి" ,"స్పిరిట్" సినిమాల నిర్మాతలుఏదైనా ప్రతిస్పందిస్తారా అనే విషయంపై నెటిజన్లలో ఆసక్తి నెలకొంది. మరి దీపికా చేసిన ఈ కామెంట్స్ పై కల్కి సినిమా మేకర్స్, స్పిరిట్ సినిమా మేకర్స్ ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.