LOADING...
Harish Shankar: హరీష్ శంకర్‌ని‌ ఇబ్బంది పెట్టిన డిప్యూటీ సీఎం సెక్యూరిటీ.. పవన్ చెప్పినా వినలేదట..!
హరీష్ శంకర్‌ని‌ ఇబ్బంది పెట్టిన డిప్యూటీ సీఎం సెక్యూరిటీ.. పవన్ చెప్పినా వినలేదట..!

Harish Shankar: హరీష్ శంకర్‌ని‌ ఇబ్బంది పెట్టిన డిప్యూటీ సీఎం సెక్యూరిటీ.. పవన్ చెప్పినా వినలేదట..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26న రిలీజ్ కాబోతుంది. పవన్ డిప్యూటీ సీఎంగా బిజీ ఉంటారని తెలిసిందే. దీంతో మిగిలిన మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ గురించి, సినిమా గురించి అనేక ఆసక్తికర అంశాలు మాట్లాడారు. అయితే పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరిగింది కాబట్టి ఆయనకు ఉండే సెక్యూరిటీ, ప్రొటొకాల్స్ తో షూటింగ్ లో పడ్డ ఇబ్బందుల గురించి తెలిపాడు హరీష్.

Details

ఇప్పుడు వెళ్లాలంటే ప్రొటోకాల్ తప్పనిసరి

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. గతంలో పవన్ సర్ దగ్గరికి వెళ్లాలంటే ఎలా కావాలంటే అలా డైరెక్ట్ గా కారవాన్ లోకి వెళ్ళేవాడిని.ఇప్పుడు వెళ్లాలంటే ప్రోటోకాల్ ఆఫీసర్లు మెటల్ డిటెక్టర్ తో చెక్ చేసి పంపుతున్నారు. రోజూ చూస్తున్నారు కదా ఎందుకు అంటే మా ప్రోటోకాల్ సర్ అనేవాళ్ళు. పొద్దున్నే డాగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి సెట్ అంతా చెక్ చేస్తారు. ఓ రోజు కళ్యాణ్ గారు కూడా ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ కి మనవాళ్లే కదా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సర్ ఇది మా ఉద్యోగం అని ఆయన చెప్పినా వినలేదు.

Details

డమ్మీ ఆయుధాలు అని చెప్పినా వినలేదు

నేనెప్పుడైనా సీన్స్ ఎక్స్ ప్లెయిన్ చేస్తూ కళ్యాణ్ చేయి పట్టుకున్నా, ఆయన్ని జరిపినా వెంటనే నలుగురు సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి అలా చెయ్యి వేయకండి అని అనేవాళ్ళు. బాబు ఇది సినిమా, షూటింగ్ చేయాలి తప్పదు అని చెప్పుకునేవాడ్ని. ఫైట్ సీన్స్ లో అయితే ప్రతి ఫైట్ లో వాడే అన్ని ఆయుధాల్ని చెక్ చేసారు, అవన్నీ డమ్మీ అని చెప్పినా చెక్ చేసారు అని తెలిపారు.

Advertisement