Page Loader
Devara: రూ.500 కోట్ల క్లబ్‌లోకి 'దేవర'.. ఎన్టీఆర్‌ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌
రూ.500 కోట్ల క్లబ్‌లోకి 'దేవర'.. ఎన్టీఆర్‌ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌

Devara: రూ.500 కోట్ల క్లబ్‌లోకి 'దేవర'.. ఎన్టీఆర్‌ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'దేవర' సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటి రోజే సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా ఇటీవల 500 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్‌ అయింది. ఈ విశేషాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మొదటిరోజు 172 కోట్ల వసూళ్లు రాబట్టిన 'దేవర' రెండో రోజుకి రూ.243 కోట్లకు చేరుకుంది. కొన్ని ఏళ్ల తర్వాత తారక్‌ సోలో హీరోగా నటించడంతో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Details

విలన్ పాత్రలో అలరించిన సైఫ్ అలీఖాన్

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటించగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో యువసుధా ఆర్ట్స్‌ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు.