
Devara: దేవర ఫస్ట్ సింగిల్ "ఫియర్ సాంగ్" లాంచ్ ఎప్పుడంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా,స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'.
బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ "జాన్వీ కపూర్" హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టనున్నారు.
ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
Details
రేపే ఫస్ట్ సింగిల్ లాంఛ్
ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే తాజాగా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా దీనికి సంబంధించి చిత్ర యూనిట్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.
దేవర ఫస్ట్ సింగిల్ అయిన "ఫియర్ సాంగ్"ను మే 19 సాయంత్రం 7.02 గంటలకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
సముద్రతీరం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నట్లు సమాచారం.
పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
"ఫియర్ సాంగ్" రిలీజ్ టైం ఫిక్స్..
#FearSong from tomorrow 7:02PM
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 18, 2024
An @anirudhofficial musical 🎶 #Devara #DevaraFirstSingle
Man of Masses @tarak9999 #KoratalaSiva pic.twitter.com/dEGHKz5S5B