Page Loader
Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. 'దేవర' షూటింగ్‌పై అప్టేట్ ఇచ్చిన మేకర్స్ 
Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. 'దేవర' షూటింగ్‌పై అప్టేట్ ఇచ్చిన మేకర్స్

Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. 'దేవర' షూటింగ్‌పై అప్టేట్ ఇచ్చిన మేకర్స్ 

వ్రాసిన వారు Stalin
Nov 14, 2023
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవ‌ర‌'. ఈ సినిమా కథను దృష్టిలో పెట్టుకొని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా గోవా షెడ్యూల్ ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యూనిట్ అంతా దీపావళి గ్యాప్ తీసుకుంది. వేడుకల అనంతరం చిత్ర బృందం మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేకర్స్ దేవర్ టీమ్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేవర టీమ్ ట్వీట్