
Devara: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. రెండు భాగాలుగా రానున్న 'దేవర' మూవీ
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్- డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'దేవర'.
ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్‌ను కొరటాల శివ ఓ వీడియో సందేశం ద్వారా బుధవారం వెల్లడించారు.
దేవర మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు తెలిపారు.
ఈ సినిమా స్టోరీ చాలా పెద్దదని, షూటింగ్ స్టార్ట్ అయ్యే కొద్దీ సినిమా మరింత పెద్దదైందని వెల్లడించారు.
ఒక భాగంగా సినిమాను విడుదల చేయడం వల్ల న్యాయం చేయలేమన్నారు. అందుకే ఈ కథను రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నామన్నారు.
దేవర పార్ట్-1 ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది.
జాన్వీ కపూర్ తెలుగులో దేవర సినిమాతో అరంగేట్రం చేస్తోంది. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కొరటాల శివ వీడియో సందేశం
#DEVARA will be coming to entertain you in 2 parts.
— Devara (@DevaraMovie) October 4, 2023
The first part is releasing on April 5, 2024. pic.twitter.com/x88jgGS9QI