Loading...
Rajinikanth: వేగం పెంచిన 'ధర్మన్'.. సెకండ్ షెడ్యూల్‌లోకి రజనీకాంత్
వేగం పెంచిన 'ధర్మన్'.. సెకండ్ షెడ్యూల్‌లోకి రజనీకాంత్

Rajinikanth: వేగం పెంచిన 'ధర్మన్'.. సెకండ్ షెడ్యూల్‌లోకి రజనీకాంత్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 13, 2026
01:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధర్మన్' షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సీనియర్ నటుడు కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ''ది డెడ్లీ డాక్టర్.. 'ధర్మన్' షెడ్యూల్ 2 మొదలైంది.. ఇది ఒక లెజెండరీ'' అంటూ పోస్ట్ చేసింది.

వివరాలు

సినిమాపై భారీ అంచనాలు..

ఈ వీడియోలో రజనీకాంత్ షూటింగ్ సెట్స్‌లో కనిపించగా.. దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఆయనతో చర్చిస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

ఈ అప్‌డేట్‌తో సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. 'ధర్మన్' ప్రకటించినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది.

ఈ ఏడాది జూన్‌లో చిత్రబృందం సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది.

ఇందులో రజనీకాంత్ లుక్‌ను ఎలా ఫైనల్ చేశారో చూపించారు. దర్శకుడు అశ్వత్ మరిముత్తు కూడా ''ఇదే హెయిర్ స్టైల్.. ఇదే లుక్'' అంటూ రజనీ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

అంతకుముందు 'ది ఓజీ స్వాగ్' పేరుతో విడుదల చేసిన మరో వీడియోలో ఫస్ట్ లుక్ కోసం రజనీకాంత్ కాస్ట్యూమ్స్, యాక్సెసరీస్‌ను ఎంపిక చేసే విధానాన్ని చూపించారు.

వివరాలు

డాక్టర్ పాత్రలో రజనీకాంత్..

అలాగే కమల్ హాసన్ షూటింగ్ సెట్స్‌కు వచ్చి రజనీకాంత్‌తో ముచ్చటించిన సన్నివేశాలు కూడా అందులో ఉన్నాయి.

ఈ సినిమాలో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు.

సమాజంలోని నేరస్థులను ఎదుర్కొనే వ్యక్తిగా ఆయన పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

గతంలో సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ కమల్ హాసన్ ''ధర్మమే వెల్లుమ్!'' అంటే ''ధర్మమే గెలుస్తుంది'' అంటూ ట్వీట్ చేశారు.

విడుదలైన టైటిల్ పోస్టర్‌లో రజనీకాంత్ ఆపరేషన్ థియేటర్‌లో స్కాల్‌పెల్ పట్టుకుని.. ఓ రౌడీ షీటర్ శరీరంపై కాలు వేసి నిల్చున్నట్లు కనిపించారు.

దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

ADVERTISEMENT