LOADING...
Dharmendra: ధర్మేంద్రకు వెంటిలేటర్‌పై చికిత్స.. స్పందించిన నటుడి టీమ్
ధర్మేంద్రకు వెంటిలేటర్‌పై చికిత్స.. స్పందించిన నటుడి టీమ్

Dharmendra: ధర్మేంద్రకు వెంటిలేటర్‌పై చికిత్స.. స్పందించిన నటుడి టీమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య సంబంధ వార్తలను ఖండించారు. ఇటీవల ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని రూమర్స్ వచ్చాయి, అయితే ఆయన టీమ్‌ వీటిని పూర్తిగా తప్పుడు అని స్పష్టించింది. 89 ఏళ్ల ధర్మేంద్ర శ్వాస సమస్యల కారణంగా అక్టోబర్ 31న ముంబయిలోని ఆస్పత్రిలోకి వెళ్లారు. తరువాత మరొకసారి హాస్పిటల్‌కు వెళ్లినప్పటికీ, వెంటిలేటర్‌పై చికిత్స పొందడం అసత్యం అని టీమ్‌ వెల్లడించింది. ధర్మేంద్ర ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్‌ విజ్ఞప్తి చేసింది.

Details

డిసెంబర్ 25న 'ఇక్కీస్' రిలీజ్

89 ఏళ్ల వయసులో కూడా నటనలో యాక్టివ్‌గా ఉన్న ఆయన, డిసెంబర్ 8న 90వ వసంతంలో అడుగుపెట్టనున్నారు. ఆయన ముఖ్య పాత్ర పోషించిన చిత్రం 'ఇక్కీస్' డిసెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా భారత పరమవీర చక్ర పురస్కార గ్రహీత సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత ఆధారంగా రూపొందించబడింది. ధర్మేంద్ర ఇందులో అరుణ్ తండ్రి పాత్రలో నటించారు.