Loading...
Dhoomakethu OTT: మలయాళం మూవీ దెబ్బకు ఓటీటీ షేక్
మలయాళం మూవీ దెబ్బకు ఓటీటీ షేక్

Dhoomakethu OTT: మలయాళం మూవీ దెబ్బకు ఓటీటీ షేక్

వ్రాసిన వారు Balachander Sharma
Oct 24, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

పెళ్లి రాత్రే హత్యకు గురవడం.. తెల్లారేసరికి మళ్లీ ప్రాణాలతో లేవడం! ఈ వింత పరిస్థితిలో చిక్కుకున్న ఓ యువకుడి కథే మలయాళ చిత్రం 'ధూమకేతు'. టైమ్‌ లూప్‌ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌కు కామెడీ, మిస్టరీ, థ్రిల్లర్‌ అంశాలను జోడించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకే రోజు పదేపదే ఎదురవుతుంటే.. అందులో నుంచి బయటపడేందుకు హీరో చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉత్కంఠకు గురిచేస్తాయి.

Details

పెళ్లిరాత్రి మొదలైన టైమ్‌ లూప్‌!

కుట్టన్‌ (సజిన్‌ గోపు), షర్మిల (నిఖిలా విమల్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.

ఎంతో ఆశగా శోభనం గదిలోకి అడుగుపెట్టిన కుట్టన్‌కు అక్కడే అనూహ్యమైన అనుభవం ఎదురవుతుంది.

కేరళ ఆకాశంలో కనిపించే ఓ వింత తోకచుక్క ప్రభావంతో అతడు టైమ్‌ లూప్‌లో చిక్కుకుంటాడు. ప్రతి రాత్రి ఒకే గదిలో హత్యకు గురవడం.. ఉదయం మళ్లీ అదే రోజుకు తిరిగి రావడం అతడి జీవితాన్ని గందరగోళంలో పడేస్తుంది.

తనను చంపుతున్నది ఎవరు? ఈ కాలచక్రం నుంచి ఎలా బయటపడాలి? అనే ప్రశ్నల చుట్టూ కథ సాగుతుంది.

కుట్టన్‌ చేసే ప్రయత్నాలు ఒక్కోసారి నవ్వులు పూయిస్తే.. మరికొన్ని సందర్భాల్లో ఉత్కంఠను పెంచుతాయి. కథలోని మలుపులు ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా చూసేలా చేస్తాయి.

Details

నటన, టెక్నికల్‌ అంశాలు బలం

సజిన్‌ గోపు తన పాత్రలో సహజమైన కామెడీతో ఆకట్టుకోగా, నిఖిలా విమల్‌ కూడా కథకు బలాన్ని అందించారు.

గణపతి, మంజు పిళ్లై, షైన్‌ టామ్‌ చాకో తమ పాత్రలతో వినోదాన్ని పంచారు. దర్శకుడు సుధీ మాడిసన్‌ క్లిష్టమైన టైమ్‌ లూప్‌ కథను సరదాగా చెప్పిన తీరు ప్రత్యేకంగా నిలుస్తుంది.

అంకిత్‌ మీనన్‌ నేపథ్య సంగీతం, జింటో జార్జ్‌ సినిమాటోగ్రఫీ సన్నివేశాలకు మరింత ప్రభావాన్ని తీసుకొచ్చాయి.

థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

నెట్‌ ఫ్లిక్స్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. టైమ్‌ లూప్‌ కథలు, మిస్టరీ కామెడీలు ఇష్టపడేవారికి 'ధూమకేతు' ఓ ఆసక్తికరమైన ఎంపిక.

ADVERTISEMENT