ఏడేళ్ళ క్రితం మొదలైన ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది అప్పుడే
విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధృవ నక్షత్రం అనే సినిమా 2016లో మొదలైంది. అనేక కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఒకదశలో ఈ సినిమా ఇక రిలీజ్ కాదని, మూలకు పడిపోయిందని అన్నారు. కానీ ఈ సినిమాను విడుదల చేస్తామని గతేడాది ఆగస్టులో హీరో విక్రమ్, దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుండి రెండు అప్డేట్స్ వచ్చాయి. ఈ సినిమాలోని రెండవ పాటను వచ్చేవారం విడుదల చేస్తామని సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాను ఈ నెల చివర్లో వెల్లడి చేయనున్నారని అంటున్నారు.
ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ పై క్లారిటీ
పెళ్ళి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా కనిపిస్తున్న చిత్రం
ఇప్పటివరకు ధృవ నక్షత్రం సినిమా నుండి ఒక పాట రిలీజ్ అయ్యింది. ఒరు మనం అనే ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో స్పై ఏజెంట్ గా విక్రమ్ కనిపిస్తాడట. భారతదేశ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి పనిచేసే 10మంది సీక్రెట్ ఏజెంట్స్ కి హెడ్ గా విక్రమ్ పాత్ర ఉండనుందట. హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో పెళ్ళి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా కనిపిస్తోంది. ఐశ్వర్యా రాజేష్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, ఆర్ పార్థిబన్, దివ్యదర్శి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఏడేళ్ళుగా ఇంకా టేబుల్ మీదనే ఉన్న ఈ సినిమా, ఈసారైనా వెండితెర మీదకు వస్తుందేమో చూడాలి.