Dhurandhar 2 : ధురంధర్ 2 బుకింగ్స్ సెన్సేషన్.. గంటల్లోనే వేల టికెట్లు సేల్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ధురందర్ 2. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. నిన్న విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుండగానే, మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌ను ప్రారంభించి అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం ప్రీమియర్ షోల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్దిసేపట్లోనే దాదాపు 86,680కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం ప్రీమియర్ షోలకే ఈ స్థాయిలో స్పందన రావడం చూస్తే, పూర్తి స్థాయి బుకింగ్స్ మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఈసినిమాకు సంబంధించిన మొదటి భాగం ఇప్పటికే రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
Details
టికెట్ల కోసం భారీ స్పందన
ట్రైలర్‌ను చూస్తేనే ఈసారి కథలో, యాక్షన్‌లో డోస్‌ను మరింత పెంచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మరో విశేషం ఏమిటంటే, ఈ సినిమాకి దాదాపు 4 గంటల నిడివి ఉండబోతోందని సమాచారం. అంత పెద్ద లెంగ్త్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు టికెట్ల కోసం భారీగా స్పందిస్తుండటం దర్శకుడు ఆదిత్య ధర్ మేకింగ్‌పై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. అదేవిధంగా మార్చి 18 సాయంత్రం 5 గంటల నుంచే పెయిడ్ ప్రివ్యూస్ నిర్వహించనున్నారు. దీంతో సినిమా టాక్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తితో అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.