LOADING...
Dhurandhar 2: బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌ రికార్డులను బద్దలు కొట్టిన 'ధురంధర్ 2'
బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌ రికార్డులను బద్దలు కొట్టిన 'ధురంధర్ 2'

Dhurandhar 2: బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌ రికార్డులను బద్దలు కొట్టిన 'ధురంధర్ 2'

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2026
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ ది రివెంజ్ ('ధురంధర్ 2') బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం చారిత్రక వసూళ్లతో హిందీ సినీ చరిత్రలో కొత్త మైలురాళ్లను నమోదు చేసింది. నాలుగు రోజుల్లో రూ.750 కోట్ల గ్రాస్ 'ధురంధర్ 2' ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే సుమారు రూ.750 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. బుధవారం జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారానే రూ.43 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, ఆదివారం ఒక్కరోజే దేశీయంగా రూ.115 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది.

వివరాలు

'పఠాన్' రికార్డు బ్రేక్

హిందీ చిత్రసీమలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సాధించిన రూ.287 కోట్ల ఓపెనింగ్ వీకెండ్ రికార్డును 'ధురంధర్ 2' సునాయాసంగా అధిగమించింది. అదే సమయంలో ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం సుమారు రూ.180 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. టాప్ ఓపెనింగ్ రికార్డుల్లో రెండో స్థానం భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో 'ధురంధర్ 2' రెండో స్థానంలో నిలిచింది. ఈచిత్రం బాహుబలి 2 (రూ.591 కోట్లు), ఆర్‌ఆర్‌ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.500 కోట్లు) వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల రికార్డులను కూడా దాటేసింది. ప్రస్తుతం పుష్ప 2 (రూ.762 కోట్లు) మాత్రమే ఈ చిత్రానికి ముందంజలో ఉంది.

వివరాలు

ముందున్న భారీ టార్గెట్

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, 'ధురంధర్ 2' త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా లాంగ్ రన్‌లో రూ.2000 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

Advertisement