Dhurandhar-2: ఓటీటీలో దురంధర్-2 సెన్సేషన్.. కేవలం మూడు రోజుల్లోనే 5 కోట్ల వ్యూస్!
ఈ వార్తాకథనం ఏంటి
దురంధర్-2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నతర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. దురంధర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1,790కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అలాగే పలువురు స్టార్ హీరోల చిత్రాల రికార్డులను సైతం అధిగమించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక జూన్ 5 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ ప్రారంభమైన దురంధర్-2కు ప్రేక్షకుల నుంచి విశేషస్పందన లభిస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రాన్ని 5 కోట్ల మందికిపైగా వీక్షించినట్లు ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ వెల్లడించింది.
వివరాలు
తొలి వీకెండ్‌లోనే ఈ స్థాయి వ్యూస్ రావడం విశేషం
ముఖ్యంగా తొలి వీకెండ్‌లోనే ఈ స్థాయి వ్యూస్ రావడం విశేషంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.