LOADING...
Dhurandhar 2: ధురంధర్ 2 సంచలనం.. తొమ్మిదేళ్ల రికార్డు బద్దలు
ధురంధర్ 2 సంచలనం.. తొమ్మిదేళ్ల రికార్డు బద్దలు

Dhurandhar 2: ధురంధర్ 2 సంచలనం.. తొమ్మిదేళ్ల రికార్డు బద్దలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2026
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2: ది రివెంజ్' ఇండియన్ బాక్సాఫీస్‌లో విప్లవాత్మక విజయం సాధించింది. తొమ్మిదేళ్లుగా నిలిచిన 'బాహుబలి 2' రికార్డులను ఈ స్పై థ్రిల్లర్ మూవీ బద్దలు కొట్టడంతో, బాహుబలి టీమ్‌ స్పందన నెట్టింట వైరల్ అవుతోంది. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ 'ధురంధర్ 2'ని చూసిన తర్వాత ఎక్స్ వేదికలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నిన్న ధురంధర్ 2 సినిమాను చూశాను. మూవీ పూర్తిగా ఎంజాయ్ చేశాను. ఇండియా మరియు వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. టీమ్‌ మొత్తానికి అభినందనలని అన్నారు.

వివరాలు

పుష్ప 2 రికార్డు బద్దలు

ఈ ట్వీట్‌ను @BaahubaliMovie అధికారిక ఖాతా రీట్వీట్ చేస్తూ, అదిత్య ధర్ ఫిల్మ్స్, ధురంధర్ 2 టీమ్‌కు అభినందనలు. ఇండియా, USA, వరల్డ్‌వైడ్‌లో బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టి కొత్త బెంచ్‌మార్కులు సృష్టించారని కొనియాడింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా అదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేస్తోంది. నార్త్ అమెరికా (USA & కెనడా)లో 9 ఏళ్లుగా నిలిచిన బాహుబలి 2 రికార్డును 'ధురంధర్ 2' తొలగించి కొత్త రికార్డ్ నెలకొల్పింది. 'పుష్ప 2' రికార్డులను కూడా ఈ సినిమా అధిగమించింది. ప్రస్తుతం 'ధురంధర్ 2' ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సాధించిన వసూళ్లను మించి కొత్త మైలురాళ్లను సెట్ చేసింది.

Advertisement