LOADING...
Dhurandhar 2 Telugu: 'ధురంధర్‌ 2' ప్రీమియర్స్ రద్దు.. తెలుగు అభిమానులకు బిగ్‌ షాక్!
'ధురంధర్‌ 2' ప్రీమియర్స్ రద్దు.. తెలుగు అభిమానులకు బిగ్‌ షాక్!

Dhurandhar 2 Telugu: 'ధురంధర్‌ 2' ప్రీమియర్స్ రద్దు.. తెలుగు అభిమానులకు బిగ్‌ షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ మూవీ 'ధురంధర్‌ 2' కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు అనూహ్యంగా నిరాశ ఎదురైంది. మార్చి 19న సినిమా విడుదల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్‌ ప్రదర్శనలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ముఖ్యంగా 'ధురంధర్‌: ది రివెంజ్‌'ను ప్రీమియర్‌లోనే తెలుగులో చూడాలని టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు షాక్‌కు గురయ్యారు. పలు మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు తెలుగు ప్రీమియర్స్‌ను చివరి నిమిషంలో రద్దు చేశాయి. ఇప్పటికే టికెట్లు బుక్ చేసిన వారికి మొత్తం డబ్బును రీఫండ్ కూడా చేశారు.

Details

తెలుగు వెర్షన్ ప్రీమియర్ షోస్ నిలిపివేత

సాంకేతిక సమస్యల కారణంగానే తెలుగు వెర్షన్ ప్రీమియర్ షోలను నిలిపివేసినట్లు సమాచారం. అయితే గురువారం అధికారిక విడుదల రోజున హిందీతో పాటు తెలుగులోనూ సినిమా యథావిధిగా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దర్శకుడు Aditya Dhar అభిమానులతో ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సినిమా పూర్తయ్యే వరకు, ముఖ్యంగా ఎండ్ క్రెడిట్స్ ముగిసే వరకు థియేటర్‌ను విడిచిపెట్టవద్దని సూచించారు. ఈ వ్యాఖ్యలతో మరో చర్చ మొదలైంది. 'ధురంధర్'కు మూడో భాగం ఉండొచ్చని సినీ ప్రియులు సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement