Dhurandhar: సౌత్ ఇండియన్ భాషల్లో ధురంధర్ 2 మూవీ.. కన్ఫమ్ చేసిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద చారిత్రక రికార్డులు సృష్టిస్తోంది. కేవలం హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూలు చేసింది. సౌత్ ఇండియాలో వచ్చిన భారీ ఆదరణను దృష్టిలో ఉంచుకుని, మేకర్స్ 'ధురంధర్ 2'ను తెలుగుతో సహా అన్ని దక్షిణాది భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
వివరాలు
తెలుగులోనూ ధురంధర్ 2
డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్'తో రణ్‌వీర్ సింగ్ ఫుల్ ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. మొదటి పార్ట్ కేవలం హిందీలో రిలీజ్ అయినప్పటికీ, ఇండియాలో రూ. 600 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. ముఖ్యంగా సౌత్ ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మొదటి సినిమా క్లైమాక్స్‌లోనే సీక్వెల్ గురించి ప్రకటించారు. రంజాన్ సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 19న 'ధురంధర్ 2' విడుదల కానుంది. మొదటి పార్ట్ కేవలం హిందీలో విడుదల అయినప్పటికీ, సౌత్ ఆడియన్స్ నుండి వచ్చిన భారీ డిమాండ్ కారణంగా సీక్వెల్‌ను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
వివరాలు
ముంబై కంటే మన దగ్గరే ఎక్కువ క్రేజ్
హిందీ సినిమా అయినా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఈ సినిమా ఆక్యుపెన్సీ రేట్లు ముంబై కన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం. 'సాక్నిల్క్' రిపోర్ట్ ప్రకారం డిసెంబర్ 23న, హైదరాబాద్ 28.75%, చెన్నై 37.25%, బెంగళూరు 49.25% ఆక్యుపెన్సీ చూపింది, అదే సమయంలో ముంబైలో కేవలం 30% మాత్రమే. ఈ నేపథ్యంలో సౌత్ డిస్ట్రిబ్యూటర్లు సీక్వెల్‌ను అన్ని భాషల్లో డబ్బింగ్ చేయడం తప్పనిసరి అని నిర్ణయించారు. రాకింగ్ స్టార్ యశ్‌తో పోటీ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ ఫైట్ సులభంగా ఉండదని అంచనా. అదే సమయంలో యశ్, కియారా అద్వానీ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'టాక్సిక్' కూడా రిలీజ్ కానుంది. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు బారుగా పోటీ చేయనున్నాయి.
వివరాలు
మూవీ కథ
'ధురంధర్' కథ భారత్ స్పై హంజా అలీ మజారీ (రణ్‌వీర్ సింగ్) మీద కేంద్రీకృతమై, పాకిస్థాన్‌లోని బలోచ్ గ్యాంగ్‌ను అంతమొందించడమే ప్రధాన అంశం. సీక్వెల్‌లో హీరో బ్యాక్‌స్టోరీని కూడా చూపనున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. 'ఉరి' సినిమాతో గుర్తింపు పొందిన ఆదిత్య ధర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.