LOADING...
Dhurandhar - 2 : 'ధురంధర్ 2' ట్రైలర్ సంచలనం.. 45 దేశాల్లో టాప్ ట్రెండింగ్
'ధురంధర్ 2' ట్రైలర్ సంచలనం.. 45 దేశాల్లో టాప్ ట్రెండింగ్

Dhurandhar - 2 : 'ధురంధర్ 2' ట్రైలర్ సంచలనం.. 45 దేశాల్లో టాప్ ట్రెండింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2026
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్‌, సెన్సేషనల్ దర్శకుడు ఆధిత్య ధార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధ‌ర్ 2. మార్చి 7న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీస్తోంది. జియో స్టుడియోస్‌,బి62 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైన కేవలం 48గంటల్లోనే అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 312మిలియన్ల వ్యూస్‌ను దాటింది. దీంతో భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ట్రైలర్ కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి స్పందనను అందుకుంటోంది. దాదాపు 45కిపైగా దేశాల్లో యూట్యూబ్ ట్రెండింగ్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచి ఈ సినిమాపై ఉన్న అంతర్జాతీయ ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది.

Details

మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల

ఈ చిత్రంలో ర‌ణ‌బీర్ సింగ్‌ 'జస్కిరత్ సింగ్ రంగీ', 'హమ్జా' అనే రెండు శక్తివంతమైన పాత్రల్లో కనిపించనున్నాడు. దీంతో అభిమానులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం సాధించిన భారీ విజయానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సీక్వెల్‌లో మరింత యాక్షన్‌, ఎమోషన్స్ ఉండబోతున్నాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో సంజ‌య్ ద‌త్‌, అర్జున్ రాంపాల్‌, ఆర్‌.మాధ‌వ‌న్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ‌తేడాది విడుదలైన ఈ చిత్ర తొలి భాగం బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Advertisement