Dhurandhar 2 Trailer: 'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజ్.. రణ్‌వీర్ సింగ్ మళ్లీ యాక్షన్ మోత!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 07, 2026
12:55 pm
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ధురంధర్‌లో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటించారు. గతేడాది చివర్లో విడుదలైన ఈసినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ధురంధర్ 2: ది రివైంజ్ రూపొందుతోంది. ఈ సీక్వెల్‌ను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదల కాగా, రెండో భాగాన్ని మాత్రం మరింత విస్తృతంగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకే హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం 'ధురంధర్ 2' ట్రైలర్‌ను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.