Dhurandhar: ఆరు దేశాల్లో 'దురంధర్' బ్యాన్.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
రణ్‌వీర్ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ధురంధర్' (Dhurandhar) సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణను అందుకుంటోంది. భారత్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్‌ని వశం చేసుకుంటున్నప్పటికీ, మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఇది పెద్ద వివాదానికి దారితీసింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఆరు గల్ఫ్ దేశాల్లో పూర్తిగా నిషేధించినట్లు తెలుస్తోంది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో 'ధురంధర్' ప్రదర్శనను నిలిపివేశారు. గల్ఫ్ మార్కెట్ బాలీవుడ్‌కు కీలకమైనదిగా భావించబడుతున్న నేపథ్యంలో అక్కడి మొత్తం థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నించినప్పటికీ, కొన్ని దేశాల్లో అనుమతులు కూడా లభించకపోవడంతో ప్రదర్శనను చాలా పరిమితంగా నిర్వహించాల్సి వచ్చింది.
Details
రూ.200 కోట్లు క్లబ్ లోకి మూవీ
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కథ నడవడం ఈ నిషేధానికి ప్రధాన కారణమని బాలీవుడ్ మీడియా నివేదిస్తోంది. (Dhurandhar Ban). గల్ఫ్‌లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్‌లో మాత్రం ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ.200 కోట్లు క్లబ్‌లో చేరే దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత హిందీ చిత్రసీమ నుంచి ఇలా భారీ నిడివి ఉన్న సినిమా రిలీజ్ కావడం.