LOADING...
Dhurandhar Vs Avatar 3: బాక్సాఫీస్‌ వద్ద సంచలనం.. 'అవతార్‌ 3'ను వెనక్కి నెట్టిన 'ధురంధర్‌'
బాక్సాఫీస్‌ వద్ద సంచలనం.. 'అవతార్‌ 3'ను వెనక్కి నెట్టిన 'ధురంధర్‌'

Dhurandhar Vs Avatar 3: బాక్సాఫీస్‌ వద్ద సంచలనం.. 'అవతార్‌ 3'ను వెనక్కి నెట్టిన 'ధురంధర్‌'

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల సినీ వర్గాల్లోనే కాదు... ప్రేక్షకుల్లోనూ 'ధురంధర్‌' పేరు మార్మోగుతోంది. విడుదలైనప్పటి నుంచి యాక్షన్ థ్రిల్లర్‌గా సంచలన విజయాన్ని నమోదు చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఇండియాలో ఏకంగా హాలీవుడ్ భారీ చిత్రం 'అవతార్‌ 3'ను కూడా వెనక్కి నెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన 'అవతార్‌: ఫైర్ అండ్ యాష్‌' డిసెంబర్‌ 19న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా భారత్‌లో మొదటి రోజు సాధించిన వసూళ్లను... 'ధురంధర్‌' తన 15వ రోజు కలెక్షన్లతోనే అధిగమించినట్లు సమాచారం. 'అవతార్‌ 3' భారత్‌లో అన్ని భాషల్లో కలిపి తొలి రోజు రూ.20కోట్ల వసూళ్లు సాధించగా, 'ధురంధర్‌' 15వ రోజునే రూ.22.50 కోట్లను రాబట్టింది.

Details

రానున్న రోజుల్లో మరెన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం

దీంతో ఈ విషయంలో 'అవతార్‌ 3'పై 'ధురంధర్‌' ఆధిక్యం సాధించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వేగం ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాల రికార్డులు కూడా 'ధురంధర్‌' తిరగరాయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌, ఆర్‌.మాధవన్‌, సంజయ్‌ దత్‌, అక్షయ్‌ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.730 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. భారత్‌లో మాత్రమే రూ.483 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఈ వారాంతంలో దేశీయంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరడం దాదాపు ఖాయమని అభిమానులు, ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

Advertisement