LOADING...
Sara Arjun: 'హీర్ రంజా'లో హీరోయిన్‌గా సారా అర్జున్? బాలీవుడ్‌లో మరో అవకాశం
'హీర్ రంజా'లో హీరోయిన్‌గా సారా అర్జున్? బాలీవుడ్‌లో మరో అవకాశం

Sara Arjun: 'హీర్ రంజా'లో హీరోయిన్‌గా సారా అర్జున్? బాలీవుడ్‌లో మరో అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల విడుదలైన 'యుఫోరియా' సినిమాలో చైత్ర పాత్రలో కనిపించిన కథానాయిక సారా అర్జున్‌ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన 'ధురంధర్' చిత్రంతో ఆమె హీరోయిన్‌గా పరిచయమైంది. తెరపై తన హావభావాలను సహజంగా వ్యక్తపరుస్తూ యువతలో మంచి ఆదరణను సంపాదించుకుంది. ఇప్పుడీ అందాల భామ మరో హిందీ సినిమాలో నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హిందీ దర్శకుడు ఇంతియాజ్ అలీ తన కొత్త ప్రాజెక్ట్ 'హీర్ రంజా'ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కొత్త జంటతో రొమాంటిక్ ప్రేమకథగా రూపొందించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

వివరాలు 

'ధురంధర్ 2' సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్న సారా

ఈ నేపథ్యంలో ఆ సినిమాలో కథానాయికగా సారా అర్జున్‌ను ఎంపిక చేయాలనే ఆలోచనలో దర్శక బృందం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక త్రిప్తి దిమ్రీ,అవినాష్ తివారీ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'లైలా మజ్ను' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో సారా అర్జున్ కథానాయికగా నటించేందుకు అంగీకరించిందా లేదా అన్న విషయం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా, సారా అర్జున్ త్వరలోనే 'ధురంధర్ 2' సినిమాతో మరోసారి ప్రేక్షకులను థియేటర్లలో అలరించేందుకు సిద్ధమవుతోంది.

Advertisement